Quick Weight Loss : న్యూ ఇయర్ రెజల్యూషన్‌లో భాగంగా చాలామంది తీసుకునే నిర్ణయం ఏంటంటే బరువు తగ్గడం. 2025లో బరువు తగ్గాలని ఆలోచించేవారు.. ఫిజిక్‌ని కాపాడుకోవాలని లేదా మంచి షేప్‌లోకి తెచ్చుకోవాలనుకునేవారు ప్రోపర్ డైట్ ప్లాన్‌ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. వ్యాయామం చేయడంతో పాటు.. డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతూ ఉంటే ఫలితాలు వేగంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బరువును వేగంగా తగ్గించడంలో హెల్ప్ అయ్యే విధంగా డైట్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
ఈజీగా బరువు తగ్గాలనుకున్నా.. వేగంగా బరువు తగ్గాలనుకున్నా.. డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. 25 శాతం వ్యాయామం హెల్ప్ చేస్తే.. 75 శాతం బరువు తగ్గించడంలో డైట్ హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అయితే బరువును తగ్గించే టాప్ డైట్ టిప్స్ ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం.
ఇంటి భోజనం
బయట దొరికే ఫుడ్స్‌కి దూరంగా ఉంటూ.. ఇంటి భోజనం తినడానికే మీరు మొగ్గు చూపాలి. లంచ్‌కి ఫుడ్ తీసుకోవెళ్లడం కష్టంగా ఉంటే.. మిల్లెట్స్, సలాడ్స్, ప్రోటీన్‌తో నిండిన ఫుడ్‌ని తీసుకువెళ్లొచ్చు. ప్రోపర్గా అన్నం తినేవారు కూరగాయలను, పప్పులను తమ డైట్లో చేర్చుకోవాలి. బయట దొరికే, ప్యాక్డ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉండాలి.
సమయానికి తగు భోజనం
ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దానిని రోజూ ఒకటే టైమ్‌కి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు లంచ్ మధ్యాహ్నం 1కి తింటే.. ప్రతిరోజు అదే సమయానికి తినాలి. ఉదయం, సాయంత్రం కూడా ఇలానే ఫాలో అవ్వాలి. రాత్రి భోజనం 7 నుంచి 8 గంటలలోపు ముగించేయాలి. నిద్రకు కనీసం 2 లేదా మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేసేయాలి.
ఈ పోషకాలు ఉండాలి..
మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా ఎప్పుడూ తిన్నా.. వాటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, హెల్తీ ఫ్యాట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ సలాడ్ని కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి. సింగిల్ సర్వ్ పోర్షన్స్ తీసుకుంటే మంచిది. ఫుడ్ తినేప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్స్ ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ పూర్తిగా దెబ్బతింటుంది.
మరిన్ని టిప్స్
ప్రతిరోజు 3 నుంచి 4 లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. మీ బరువుకు తగ్గ కేలరీలను తీసుకుంటూ.. ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలను ఇన్క్లూడ్ చేసుకుంటే మంచిది. సింపుల్ వర్క్అవుట్ రోటీన్‌ను ఫాలో అవ్వొచ్చు. కనీసం రోజుకు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేస్తే మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీరు ఎన్ని ఫాలో అయినా.. ఒత్తిడి తగ్గకుంటే బరువు తగ్గడం అసాధ్యమనే చెప్పాలి.
తినకూడని ఫుడ్స్ ఇవే..
బరువు తగ్గాలంటే ఫ్రైడ్ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలి. ఇది బరువు పెరగకుండా హెల్ప్ చేస్తుంది. చిప్స్, బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని అస్సలు తినకూడదు. అన్‌హెల్తీ ఫ్యాట్స్, షుగర్స్ ఉండే ఫుడ్ తీసుకుంటే బరువు ఈజీగా పెరిగిపోతారు. ఇవన్నీ బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తాయి. కాబట్టి వీటిని మైండ్‌లో పెట్టుకుని 2025లో బరువు తగ్గాలనుకునే గోల్‌ని ఈజీగా రీచ్ అయిపోవచ్చు.
Also Read : బరువు తగ్గేందుకు బొప్పాయిని పరగడుపునే తినాలట.. మరిన్నో బెనిఫిట్స్ కూడా