Joy Nemo Launched In India: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి భారత మార్కెట్లోకి వాహనాలను విడుదల చేస్తున్నాయి. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ (Wardwizard Innovations and Mobility Limited) అనే స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఒక కిలోమీటరు వెళ్లడానికి కేవలం 17 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. జాయ్ నెమో అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999 ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను కేవలం రూ.999కే బుక్ చేసుకోవచ్చు.
జాయ్ నెమో రేంజ్ ఎంత?
జాయ్ నెమో మూడు రైడింగ్ మోడ్‌లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను ఎకో, స్పోర్ట్, హైపర్ మోడ్‌లో నడపవచ్చు. ఈ స్కూటర్‌ను పట్టణ రహదారులపై నడపడానికి రూపొందించారు. జాయ్ నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్‌తో 130 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1500W సామర్థ్యం కలిగిన బీఎల్‌డీసీ మోటార్‌ను ఉపయోగిస్తుంది. దీనికి 3 స్పీడ్ మోటార్ కంట్రోలర్‌ను కూడా జోడించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 65 కిలోమీర్ల వేగంతో నడపవచ్చు. సిల్వర్, వైట్ కలర్ స్కీమ్‌తో జాయ్ నెమో మార్కెట్లోకి వచ్చింది.
Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!
జాయ్ నెమో ఫీచర్లు ఇవే...
సస్పెన్షన్ కోసం జాయ్ నెమో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. స్కూటర్ రెండు చక్రాలకు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించారు. దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ కారులో కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ కూడా అందించారు. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీలతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఐదు అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్ప్లేను కలిగి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్మార్ట్ క్యాన్ బ్యాటరీ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికి కనెక్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మొబైల్ డివైస్‌లను ఛార్జ్ చేయడానికి యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ అసిస్ట్ ఫీచర్ అందించారు. ఇది పార్క్ చేసిన వాహనాన్ని బయటకు తీయడంలో సహాయపడుతుంది.
Also Read: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!