Bigg Boss 8 Telugu Winner Runner Up: బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. టీవీ సీరియల్ హీరోగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన నిఖిల్ మొదటి నుంచి తన పైన ఉన్న అంచనాలకు తగ్గకుండా ఆడుతూనే వచ్చాడు. టాస్క్‌ల్లో పట్టుదల కనపరచి, హౌస్‌లో కామ్‌నెస్ కోల్పోకుండా మంచి గేమ్ ఆడిన నిఖిల్ బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచాడని చెప్పవచ్చు. మొదట్లోనే వరుసగా మూడు సార్లు హౌస్ చీఫ్‌గా ఉన్నాడు. ఆ సమయంలోనే హౌస్‌ని బాగా కంట్రోల్‌లో ఉంచడం నిఖిల్‌కు బాగా ప్లస్ అయింది.
రన్నరప్‌గా గౌతమ్...
అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టిన గౌతమ్ కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. అశ్వద్ధామ 3.0 అంటూ బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో నిలిచాడు. అలాగే మూడో స్థానంలో నబీల్, నాలుగో స్థానంలో ప్రేరణ, ఐదో స్థానంలో అవినాష్ నిలిచారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ ట్రోఫీని అందుకున్నాడు.
Also Read: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్
సహనంగా ఉండటమే వరమైందా?
ఒకటి రెండు సార్లు మినహా ఎంత పెద్ద వివాదంలో కూడా నిఖిల్ ఇంత వరకు సహనం కోల్పోలేదు. స్వతహాగా సీరియల్ నటుడు కావడంతో తనకంటూ ప్రత్యేకమైన ఓట్ బ్యాంకుతోనే నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లో వచ్చాడు. అలాగే స్నేహితులైన పృధ్వీ, యష్మి, విష్ణు ప్రియల ఓట్ బ్యాంకు కూడా చివరి వారంలో నిఖిల్‌కు వచ్చిందని అంచనా.
అలాగే గౌతమ్‌తో తనకు ఉన్న డిఫరెన్సెస్ కూడా నిఖిల్ సెట్ చేసుకున్నాడు . మధ్యలో పాత హౌస్ మేట్స్ యష్మీని ఎమోషనల్ గా వాడుకునే ప్రయత్నం చేశాడంటూ కారణంగా చూపించి నిఖిల్‌ను నామినేట్ చేయడం అతనికే సింపతీ తెచ్చిపెట్టాయి. ఇవన్నీ బిగ్ బాస్‌లో నిఖిల్ గేమ్‌కు ప్లస్‌గా మారాయని అనుకోవచ్చు.
అలాగని నిఖిల్ ఆటలో మైనస్‌లు కూడా లేకపోలేదు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో తీసుకోవాల్సిన స్టాండ్‌ను కూడా నిఖిల్ తీసుకోలేదని తనపై విమర్శలు ఉన్నాయి. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే పృథ్వీ విషయంలో కూడా నిఖిల్ ఓపెన్‌గా మాట్లాడలేదు. గేమ్‌లో స్ట్రాంగ్‌గా ఉండే ప్లేయర్స్‌ను ముందే గుర్తించి వారితో ఫ్రెండ్ షిప్ చేస్తాడనే విమర్శ కూడా ఉంది. సోనియా, పృథ్వీ, నబీల్‌లతో అలాగే స్నేహం చేశాడని అంటారు. కానీ మొత్తానికి వాటన్నిటినీ అధిగమించడం వల్లనే నిఖిల్ విన్నర్‌గా నిలవగలిగాడని చెప్పవచ్చు.
Also Read: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా