Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8కి ఎండ్ కార్డు పడింది. విన్నర్ ఎవరు? అనేది కొన్ని గంటల్లో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. బిగ్ బాస్ 8 విజేతగా నిలిచేది ఎవరు? అనేది పక్కన పెడితే... విన్నర్ ఎవరైనా సరే, వాళ్ళు అందుకునే అమౌంట్ ఎంత? విజేతకు స్టార్ మా ఛానల్ ఎంత ఇస్తుంది? అనేది చూస్తే...
బిగ్ బాస్ 8 ప్రైజ్ మనీ... రూపాయి తక్కువ 55 లక్షలు
Bigg Boss 8 Telugu Winner Prize Money: అక్షరాలా యాభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు... 54,99,999. ఒక్కటంటే ఒక్క రూపాయి తక్కువ 55 లక్షలు. ఇదీ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఖాతాలోకి వచ్చే ప్రైజ్ మనీ.
సోలో బాయ్ డాక్టర్ గౌతమ్ కృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ మలయక్కల్... ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరిలో నిఖిల్ మొదటి నుంచి హౌస్‌లో ఉన్నాడు. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ సీజన్ 8 మొదలు అయ్యింది. అంటే... ఆయన ఇంటిలోకి వెళ్లి ఇప్పటికి 105 రోజులు ఉన్నాడు. ఒకవేళ అతను గనుక విన్నర్ అయ్యాడనుకోండి... ఏవరేజ్ గా ఒక్కో రోజుకు ఆల్మోస్ట్ ఐదు లక్షల రెమ్యూనరేషన్ వచ్చినట్టు. అఫ్ కోర్స్... అందులో ట్యాక్స్ కూడా కట్ అవుతుందని అనుకోండి.
Also Read: 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?
ఒకవేళ గౌతమ్ కృష్ణ గనుక విన్నర్ అయ్యాడనుకోండి... అతను 'బిగ్ బాస్ 8'లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టారు. అతను 35వ రోజు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాడు. గేమ్ మొదలై 105 రోజులు గనుక... అందులో 35 రోజులు తీస్తే ఇంటిలో గౌతమ్ ఉన్నది 70 రోజులు. అప్పుడు అతను రోజుకు ఏడున్నర లక్షలు అందుకున్నట్టు. మరి, ఇద్దరిలో ఎవరు విన్నర్? ఎవరు రన్నరప్? అనేది కొన్ని గంటల్లో తెలుస్తుంది.
టాప్ 5లో ఉన్న వారిలో ఎవరి ప్లేస్ ఏమిటి?
నిఖిల్, గౌతమ్ కృష్ణ కాకుండా... బిగ్ బాస్ సీజన్ 8 చివరి వరకు వచ్చి టాప్ 5 లిస్టులో చోటు సంపాదించుకున్న మరో ముగ్గురు ముక్కు అవినాష్ (జబర్దస్త్ అవినాష్), 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఫేమ్ ప్రేరణ కంభం, ఎటువంటి సినీ టీవీ నేపథ్యం లేని సాధారణ కుర్రాడు, వరంగల్ యువకుడు, యూట్యూబర్ నబీల్ అఫ్రిది. ఈ ముగ్గురిలో ఐదో స్థానంలో అవినాష్ నిలవగా... ఆ తర్వాత నాలుగో స్థానంలో ప్రేరణ... ఇక మూడో స్థానంలో నబిల్ నిలిచినట్టు తెలిసింది. ఎవరెవరికి ఎంత వచ్చాయి? ఎవరెవరు ఎంత మనీ అందుకున్నారు? అనేది త్వరలో తెలుస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సూట్ కేస్ ఆఫర్ ఇవ్వగా... ప్రేరణ రిజక్ట్ చేసినట్టు తెలిసింది.