Bigg Boss 8 Telugu Finale Episode Nikhil Or Gautam Wins The Trophy: బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ చివరి అంకం ఆదివారంతో పూర్తి కానుంది. వంద రోజులకు పైగా జరిగిన ఈ సీజన్‌లో ఎన్నో ట్విస్టులు వచ్చాయి. రకరకాల కొత్త పద్దతులోనూ సీజన్‌ను నడిపించారు. ఇంత వరకు ఎప్పుడూ జరగనట్టుగా నామినేషన్స్ జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలను పట్టుకొచ్చారు. ఎనిమిది మంది వైల్డ్ కార్డుల్ని ఒకేసారి పంపడంతో షో ఒక్కసారిగా పైకి లేచింది. ఈ ఎనిమిదో సీజన్ మాత్రం వైల్డ్ కార్స్ రాకముందు.. వచ్చిన తరువాత అన్నట్టుగా మారిపోయింది.
ఇక ఇప్పుడు పదిహేను వారాలు ముగిశాయి. టాప్ 5లో నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, అవినాష్ నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్ అయ్యే ఛాన్స్ మాత్రం నిఖిల్, గౌతమ్‌లకే ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ స్టార్టింగ్‌లో విష్ణు ప్రియ విన్నర్ అనుకున్నారు. కానీ ఆమె తన చేజేతులా అంతా నాశనం చేసుకుంది. ఆ తరువాత నిఖిల్ విన్నర్ అని అనుకున్నారు. కానీ ఆ గ్రూపుల్లోంచి బయటకు రావడం లేదని అనుకున్నారు. ఆపై నబిల్ మీద కాస్త హోప్స్ ఏర్పడ్డాయి. కానీ మెహబూబ్‌తో కలిసి కమ్యూనిటీ గురించి మాట్లాడి వెనకపడ్డాడు.
వైల్డ్ కార్డుల తరువాత నబిల్ ఆట మొత్తం గాడి తప్పింది. వైల్డ్ కార్డుల్లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. మెల్లిమెల్లిగా గౌతమ్ షైన్ అవుతూ వచ్చాడు. అయితే వచ్చిన మొదటి వారానికే ఎలిమినేషన్ వరకు రావడంతో ఒక్కసారిగా అతని మైండ్ బ్లాక్ అయింది. అప్పటి నుంచి ఆట తీరు మార్చుకున్నాడు. తనని తాను చెక్కుకుని శిల్పంలా మారాడు. ఇప్పుడు విన్నర్ లేదా రన్నర్ అయ్యే స్థాయికి వచ్చాడు.
Also Read: 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?
నిఖిల్ ముందు నుంచి కూడా విన్నర్ రేసులోనే ఉన్నాడు. మధ్యలో డీవియేట్ అయ్యాడు. మాటలు జారాడు. సేఫ్ గేమర్ అనిపించుకున్నాడు. అమ్మాయిల ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నాడు అని నిందలు మోశాడు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ, ఈదుకుంటూ ఇక్కడి వరకు వచ్చాడు. ఇప్పుడు విన్నర్ పొజిషన్‌కు అన్ని అర్హతలు ఉన్న వాడని అందరి చేత అనిపించుకుంటున్నాడు. కన్నడ వాడిని ఎందుకు గెలిపించడం.. ఇది తెలుగు బిగ్ బాస్.. తెలుగు వాడ్నే విన్నర్‌ని చేద్దామని ఆడియెన్స్ అనుకుంటే మాత్రం కచ్చితంగా గౌతమ్ విన్నర్ అయి నిఖిల్ రన్నర్ అవుతాడు.
ఎవరు విన్నర్ అయినా ఎవరు రన్నర్ అయినా కూడా చాలా తక్కువ మార్జిన్ ఓట్లతోనే గెలుస్తున్నారు..ఓడుతున్నారు అని అంతా అంటున్నారు. ఫస్ట్ రెండు స్థానాలకు మాత్రం నిఖిల్, గౌతమ్‌లు అర్హులే అని అంతా ముక్తకంఠంతో చెప్పేస్తున్నారు. విన్నర్ ట్రోఫీని రామ్ చరణ్ చేతుల మీదుగా విజేతకు అందించబోతోన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.