Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Bigg Boss 8 Telugu Grand Finale LIVE Updates: 'బిగ్ బాస్' సీజన్ 8 ఫినాలేకి చేరింది. సోలో బాయ్ గౌతమ్ విన్నర్ అని తేలింది. అఫీషియల్‌గా సాయంత్రం అనౌన్స్ చేస్తారు. షోలో ఇంకా ఏం జరగబోతుంది? అనేది చూడండి.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ 'బిగ్ బాస్' ఇంటిలోకి వెళ్లినట్టు ప్రోమోలో చూపించారు. ప్రజెంట్ ఆమె 'డాకు మహారాజ్' మూవీలో యాక్ట్ చేస్తోంది. సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ కానుంది.
'బిగ్ బాస్ 8' గ్రాండ్ ఫినాలేలో ఇద్దరు అందాల భామలు డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నభా నటేష్, రాయ్ లక్ష్మి డ్యాన్స్ చేశారు. వాళ్లిద్దరి గ్లామర్ ఈ షోకి స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
బిగ్ బాస్ 8 విన్నర్ ఎవరు? నిఖిల్ అవుతాడా? లేదంటే గౌతమ్ కృష్ణ అవుతాడా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి, దీనికి ముందు జరిగిన ఏడు సీజన్లలో విన్నర్స్ ఎవరో గుర్తు ఉందా? వాళ్ళు ఎవరో తెలుసుకోండి.
Also Read: 'బిగ్ బాస్' విజేతలుగా నిలిచిన ఆ ఏడుగురు... వాళ్ళ సరసన చేరేది ఎవరు? Bigg Boss 8 Telugu Winner అతనేనా?
Bigg Boss Grand Finale Celebrations: బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ప్రోమోను లేటెస్టుగా విడుదల చేసింది స్టార్ మా. ఆ ప్రోమోలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పాటు ఓల్డ్ కంటెస్టెంట్లు కొంత మంది సందడి చేశారు. అది ఎలా ఉందో చూడండి.
కన్నడ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు ఉపేంద్ర 'బిగ్ బాస్ 8' ఫినాలేలో సందడి చేశారు. డిసెంబర్ 20న విడుదల కానున్న కొత్త సినిమా 'యుఐ' ప్రచారం నిమిత్తం వచ్చారు.
బిగ్ బాస్ షో చివరకు వచ్చేసరికి ఐదుగురు కంటెస్టెంట్లు మిగిలారు. అందులో సోలో బాయ్ గౌతమ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని వినబడుతోంది. అతనితో పాటు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఫేమ్ ప్రేరణ కంభం, నిఖిల్, నబీల్ ఆఫ్రిది, ముక్కు అవినాష్ ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 ఈ ఏడాది సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. ఇవాళ్టికి షో మొదలై 106 రోజులు. ఇందులో 22 మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. అందులో 17 మంది హౌస్ నుంచి బయటకు వచ్చారు. ప్రజెంట్ ఐదు మంది ఉన్నారు. ఆ ఐదుగురిలో విన్నర్ ఎవరు? అనేది సాయంత్రం అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.
Background
తెలుగు బుల్లితెర మీద అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మధ్యలో ఓటీటీ కోసం షో చేశారు. మూడు నెలల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ (bigg Boss Telugu season 8 grand finale)కు ఈ రోజుతో ఎండ్ కార్డు పడుతుంది. బిగ్ బాస్ ఫినాలేలో హైలైట్స్ ఏంటి? ఏం జరుగబోతోంది? అనేది తెలుసుకోవడం కోసం ఈ లైవ్ అప్డేట్స్ పేజ్ ఫాలో అవ్వండి.
ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. షో హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున తో కలిసి స్టేజి మీద సందడి చేశారు. ఆయనతో పాటు మరో మెగా హీరో, సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ కూడా ఫినాలేకు అతిథిగా వచ్చారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాలేదు కానీ... వాళ్లిద్దరి సినిమా టీమ్స్ వచ్చాయి. 'డాకు మహారాజ్'తో పాటు 'పుష్ప 2' టీమ్ కూడా సందడి చేసింది. ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. ఈ చిత్ర బృందాలతో పాటు కన్నడ హీరో ఉపేంద్ర, తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి సైతం సందడి చేశారు. 'విడుదల 2', 'యుఐ' మూవీ ప్రమోషన్స్ చేశారట.
బిగ్ బాస్ 8 ఫినాలేకి చేరుకున్న టాప్ 5 ఎవరు?
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలైంది. షో స్టార్ట్ అయ్యి 105 రోజులు అయ్యింది. మొదట బిగ్ బాస్ ఇంట్లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 35వ రోజున మరో ఎనిమిది మంది ఇంట్లో అడుగు పెట్టారు. టోటల్ 22 మంది కంటెస్టెంట్లు కాగా... అందులో 17 మంది ఆల్రెడీ బయటకు వచ్చేశారు. ఇక ఇంటిలో ఉన్నది ఐదుగురు.
హీరో కమ్ డాక్టర్ గౌతమ్ కృష్ణతో పాటు 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఫేమ్ ప్రేరణ కంభం, మరో సీరియల్ నటుడు నిఖిల్, ఎటువంటి నేపథ్యం లేకుండా ఇంటిలో అడుగుపెట్టిన వరంగల్ కుర్రాడు - యూట్యూబర్ నబీల్ అఫ్రిది, టీవీ షోలు చూసే తెలుగు ప్రజలకు బాగా తెలిసిన అవినాష్ చివరి వరకు మిగిలారు. ఇందులో తెలుగోడు గౌతమ్ విన్నర్ అయ్యాడని టాక్. ఆ విషయం ఫినాలేలో అనౌన్స్ చేయనున్నారు.
ఫినాలేలో గౌతమ్ విన్నర్ అని చెప్పే ముందు ఏం జరుగుతుంది? షో ఎలా రన్ చేస్తారు? ఎవరెవరు ఏయే పాటలకు డ్యాన్స్ చేస్తారు? అనేది చూడాలి. ఆ అప్డేట్స్ కోసం లైవ్ పేజీ ఫాలో అవ్వండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -