Immune Enhancing Therapies in TB patients : ప్రపంచవ్యాప్తంగా 2022లో 7.5 మిలియన్ల మంది టీబీ బారిన పడినట్లు తాజా అధ్యయనం తేల్చింది. 1.3 మిలియన్​ మంది టీబీతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలోనే టీబీ చికిత్సను అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు ముమ్మరం చేశారు. తాజాగా నిర్వహించిన అధ్యనం ఈ పరిశోధనలకు మంచి ఫలితాలనే ఇస్తుందని తెలిపారు పరిశోధకులు. టీబీ చికిత్సకు రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు నిపుణులు. 


టీబీ రోగిలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇవి రోగిలో అనారోగ్యాన్ని తగ్గించి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయని తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను అసోసియేట్ ప్రొఫెసర్ సుసన్నా బ్రిగెంటి, సెంటర్​ ఫర్ ఇన్​ఫెక్షియన్ మెడిసిన్, ANA ఫ్యూచురా కరోలిన్​స్కా ఇన్​స్టిట్యూట్​, స్టాక్​హోమ్​ త్వరలోనే స్వీడన్​లో ప్రదర్శించనున్నారు. మైకోబాక్టీరియం క్షయవ్యాధి సోకిన వ్యక్తికి రోగనిరోధక ప్రతిస్పందనను మార్చడంలో ఈ మందులు హెల్ప్ చేస్తాయని తెలిపారు. రోగి శరీరంలో రోగనిరోధక కణాలలో యాంటీ మైక్రోబయాల్ ఎఫెక్టర్ ఫంక్షన్​లను కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని పరిశోధకులు అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. 


చికిత్స లేట్​ అవ్వడంవల్ల పెరుగుతున్న మరణాలు


కొన్ని కొత్త యాంటీ మైక్రోబయాల్ థెరపీలు అందుబాటులో ఉన్నప్పటికీ.. యాంటీబయాటిక్స్​తో చికిత్స చేసిన అది ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల చికిత్స లేట్​ అవ్వడం.. కొందరికి చికిత్స సరిగ్గా అందక.. మృత్యుబారిన పడుతున్నారు. అందుకే రోగిలో రోగనిరోధకశక్తిని పెంచే విధంగా పరిశోధనలు పెరిగాయి. యాంటీబయాటిక్ నిరోధకతను అందించే ఉత్పరివర్తనలు మైకోబాక్టీరియా అంతర్గత లక్షణాలు.. పాత, కొత్త యాంటీబయాటిక్​ల సమూహాలపై సమర్థవంతంగా పనిచేస్తాయి. దీనివల్ల అనుబంధ చికిత్సలు మెరుగవుతాయి. అందుకే టీబీ వ్యతిరేకంగా చేపట్టిన ఈ కొత్త చికిత్స విధానాలు చాలా ముఖ్యమైనవి. 


యాంటీబయాటిక్ డోస్ పెంచే బదులు


రోగిలో రోగనిరోధక శక్తిని పునరుద్ధరించేందుకు, టీబీ రోగులలో ఉన్న మంటను తగ్గించి యాడ్​ ఆన్​ థెరపీల ద్వారా ఇప్పటికే ఉన్న యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని మెరుగుచేయవచ్చు. ప్రామాణిక టీబీ చికిత్సలో రోజువారీ 4 నుంచి 9 యాంటీబయాటిక్​లు ఉంటాయి. అయితే వాటికి మరో యాంటీమైక్రోబయాల్ మెడిసన్ ఇచ్చే బదులు.. రోగిలో రోగనిరధక శక్తిని పెంచే సమ్మేళనం.. టీబీని తగ్గిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇది టీబీ రోగులలో ముఖ్యంగా MDR-TB రోగులలో వైద్యపరంగా రికవరీని ప్రోత్సాహిస్తుంది. 


బ్యాక్టీరియా పెరుగుదలను కంట్రోల్ చేస్తాయి


హోస్ట్ డైరెక్టెడ్ థెరపీలు శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా HDT బ్యాక్టీరియా పెరుగుదలను నేరుగా నిరోధించే బదులు యాంటీమైక్రోబయల్ ఫంక్షన్లను పునరుద్ధరించడానికి, ప్రేరేపించడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి వ్యాధి సోకిన కణాలే లక్ష్యంగా పనిచేస్తాయి. ప్రతిస్పందనలను సమతుల్యం చేసి.. రోగనిరోధక శక్తిని అందించడంలో హెల్ప్ చేస్తుంది. 


అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి..


పరిశోధనలో సక్సెస్ అవుతున్న మందులు రోగనిరోధక వ్యవస్థలో ఉన్న కణాలలో జన్యువులను నియంత్రిస్తాయి. తద్వారా యాంటీ బ్యాక్టీరియల్ హోస్ట్ ఢిఫెన్స్​తో ప్రోటీన్​లను మెరుగుపరుస్తాయి. యాంటీబయాటిక్స్ లేనప్పటికీ.. రోగనిరోధక కణాల లోపల Mtb పెరుగుదలను దాదాపు 75 శాతం తగ్గిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ ఇమ్యూనోమోడ్యులేటరీ విధానం ప్రామాణిక చికిత్సలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. యాంటీబయాటిక్స్​తో కలిసి.. సినర్జిస్టిక్ ప్రభావాలు చూపిస్తున్నాయని వెల్లడించారు. రోగికి వీటిని యాంటీబయాటిక్స్​తో పాటు అవసరమైన మోతాదులో అందిస్తే.. అతను వేగవంతంగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. '



కేవలం టీబీనే కాకుండా..


చికిత్సలో భాగంగా ఇమ్యునోథెరపీని అమలు చేయడం వల్ల క్యాన్సర్, ఆటో ఇమ్యూనిటీ, ఆస్తమా, అలెర్జీల చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయట. అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న పరిశోధన.. టీబీ ఉన్న రోగులలో ఓ గేమ్​ఛేంజర్​ కాబోతుందని చెప్తున్నారు. ఇది క్లినికల్ మేనేజ్​మెంట్​ను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి.. టీబీ చికిత్సను ప్రతి ఒక్కరూ అందించే దిశగా పరిశోధలు జరుగుతున్నాయి. 


Also Read : పిల్లలను త్వరగా నిద్రపుచ్చడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.