Allari Naresh About Actor Nani: అల్ల‌రి నరేష్.. ఒక‌ప్పుడు కామెడీ సినిమాల‌కు పెట్టింది పేరు. అదిరపోయే పంచ్‌లు, జోకులతో అల‌రించడం ఆయన తర్వాతే ఎవరైనా. అయితే, ఒక్కసారిగా ఆయన జోన‌ర్ మార్చేశారు. కామెడీని ప‌క్క‌న పెట్టి, ఎమోష‌న‌ల్, సీరియ‌స్ కాన్సెప్ట్స్ తో జ‌నాల ముందుకు వ‌చ్చారు నరేష్. అయితే, అలా చేయ‌మ‌ని చెప్పింది నానినే అట‌. నరేష్, ఫరియా అబ్దుల్లా జంట‌గా న‌టించిన ‘ఆ ఒక్క‌టి అడ‌క్కు’ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు చెప్పారు. త‌న‌లో కామెడీ కాకుండా వేరే కోణం కూడా ఉంద‌ని నాని అన్నార‌ని, ఆ మాట‌లు విని ఆలోచించాను అని నరేష్ అన్నారు. 


నాలో మ‌రో యాంగిల్ ఉంద‌న్నారు నాని.. 


"చాలా రోజుల నుంచి కామెడీ మాత్ర‌మే చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంది నాలో. ‘మేడ మీద అబ్బాయి’ ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చిన‌ప్పుడు నాని ఇలా అన్నారు. నరేష్‌కు చాలా పొట‌న్షియ‌ల్ ఉంది. అంద‌రూ ఒక‌వైపే చూస్తున్నారు. అత‌నిలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. "'గ‌మ్యం', 'శంభో శివ శంభో', 'నేను' అలాంటివి చేస్తే బాగుంటుంది. కామెడీ కాకుండా అలాంటి కూడా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను" అన్నాడు. అయినా కూడా ఆ త‌ర్వాత కామెడీ చేశాను. అవ‌న్నీ నాకు కావాల్సి చేయ‌లేదు. ప్రొడ్యూస‌ర్ అండ్ డైరెక్ట‌ర్. సార్ మీతో కామెడీ సినిమా చేస్తాను అని అప్రోచ్ అయ్యేవాళ్లు." 


త‌ర్వాత ఆలోచించాను.. 


"ఆ త‌ర్వాత ఏమైందంటే? కామెడీ చేసినా పెద్ద‌గా హిట్ అవ్వ‌డం లేదు. అందుకే మొత్తం కామెడీ చేయ‌కూడ‌దు అని డిసైడ్ అయ్యాను. పంచ్ లు అన్నీ రాస్తున్నారు. కానీ, క‌థ ఏం ఉండ‌టం లేదు. ఎక్క‌డ రాంగ్ స్టెప్ వేస్తున్నానా? అని ఆలోచించాను. అప్పుడు నాన్న‌గారి సినిమాలు అన్నీ అబ్జ‌ర్వ్ చేసి క‌థ‌లో కామెడీ ఉండాలి, అది మిస్ అవుతుంది  అని అర్థం అయ్యింది. జ‌నాల‌కు డిఫ‌రెంట్ గా కావాలి అనుకున్నాను. అలా వెయిట్ చేసి అప్పుడు 'నాంది' చేశాను. 'నాంది' హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత 'మారేడుమిల్లి', 'నా సామిరంగ‌', 'ఉగ్రం' చేశాను. నాలుగు సినిమాలే చేశాను. మ‌ళ్లీ ఇటు వ‌చ్చేశాను. త‌ను కూడా ఏమ‌న్నాడంటే? అదే కాదు ఇది కూడా చేయి అన్నాడు. ఇప్పుడు వ‌చ్చి రివ‌ర్స్ చెప్పాడు. "నరేష్ ని నేను ఆపేయ‌మ‌ని చెప్పాన‌ని, నేనే ఆయ‌న కామెడీ చాలా మిస్ అవుతున్నాను" అని అన్నాడు. ఆడియెన్స్ కూడా అదే అనుకునే ఛాన్స్ ఉంది క‌దా?  అని అన్నారు నరేష్. 


మే 3న.. 


'ఆ ఒక్క‌టి ఆడ‌క్కు' సినిమా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫరియా అబ్దుల్లా, అల్ల‌రి నరేష్ న‌టించిన ఈసినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంద‌రినీ ఆక‌ట్టుకుంది. పెళ్లి అవ్వ‌డం లేద‌నే ఒక కాన్సెప్ట్ తో తెర‌క్కెకించారు దీన్ని. దీంతో ఈ రోజుల్లో ప్రాబ్ల‌మ్ ఫేస్ చేస్తున్న చాలామంది ఈ సినిమాకి బాగా క‌నెక్ట్ అయ్యారు. ట్రైల‌ర్ యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది . ఇప్ప‌టికే నరేష్ చెప్పిన చాలా డైలాగులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


Also Read: వైర‌ల్ అవుతున్న మ‌హేశ్ బాబు వీడియో.. రాజ‌మౌళి సినిమా లుక్ అదేనా?