Mahesh Babu New Look With Long Hair: మహేశ్ బాబు మిల్కీ బాయ్ అని ఆయనకు పేరు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా చాలా క్యూట్ గా కనిపిస్తారు ఆయన. కూల్ గా, హ్యాండసమ్ గా, సింపుల్ గా ఉంటారు. అయితే, ప్రస్తుతం ఆయన తన లుక్ ని పూర్తిగా మార్చేశారు. మహేశ్ బాబుకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంట్లో ఆయన చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. దీంతో ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. ఎస్ ఎస్ ఎంబీ 29 లుక్ అదే అంటూ ఊహించుకుంటున్నారు.
ఫ్యామిలీ ఫంక్షన్ లో..
మహేశ్ బాబు తన భార్య నమ్రత, సితార తో కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు. దాంట్లో ఆయన హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడూ షార్ట్ హెయిర్ తో ఉండే ఆయన.. జుట్టు పెంచి కనిపించాడు. దీంతో రాజమౌళి సినిమా కోసమే మహేశ్ బాబు అలా జుట్టు పెంచాడనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో మహేశ్ బాబు అక్క మంజుల కూడా తమ్ముడి జుట్టుపట్టుకుని ఏదో అని, నవ్వుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అంతా.. SSMB29 కోసం ఆయన ఇలా తయారు అయ్యాడు. ఇదే లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రీ పొడక్షన్ పనులు..
'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత.. మహేశ్ బాబుతో సినిమా తీస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. స్క్రిప్ట్ రెడీ అయ్యిందని, ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు ఆయన. కాస్ట్ ఇంకా ఎవ్వరూ ఫైనల్ అవ్వలేదని, కేవలం హీరో మాత్రమే ఫైనల్ అయినట్లు జపాన్ లో జరిగిన ఒక ఈవెంట్ లో చెప్పారు రాజమౌళి. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమాకి సంబంధించి లుక్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు బయటికి వచ్చాయి. ఇక ఇప్పుడు మహేశ్ బాబు ఇలా కనిపించడంతో.. అందరూ లుక్ ఇదే ఫైనల్ అనుకుంటున్నారు.
రెమ్యునరేషన్ ఎంతంటే?
జనరల్ గా మహేశ్ బాబు ఒక్కో సినిమాకి రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్లు తీసుకుంటారని టాక్ ఉంది. అయితే, ఈ సినిమాకి మాత్రం అంతకు మించి ఛార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, మహేశ్ బాబు ఈ సినిమాకి ప్రాఫిట్స్ లో షేర్ తీసుకునే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక మిగతా యాక్టర్స్ గురించి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ విలన్ గా నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల అమీర్ ఖాన్, రాజమౌళి ఇద్దరు భేటీ అయి దీనికి సంబంధించి చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎన్టీఆర్ను ఇమిటేట్ చేశారా అంటూ ప్రశ్న.. విశ్వక్ సమాధానం ఏమిటంటే..