Vishwak Sen About JR. NTR In Gangs of Godavari Teaser Launch: విశ్వ‌క్ సేన్.. మాస్ సినిమాల‌కి పెట్టింది పేరు. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు విశ్వ‌క్. ఆయ‌న న‌టించిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా టీజ‌ర్ లాంచ్ ఈవెంట్ ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ ఈవెంట్ లో విలేకరులు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఇంట్రెస్టింగ్ స‌మాధానాలు ఇచ్చారు విశ్వ‌క్. జూ. ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఆయ‌న‌పై చాలా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఏమ‌న్నారంటే? 


ఇండియాలోనే గొప్ప న‌టుడు..


విశ్వ‌క్ సేన్ ఏ ఈవెంట్ కి అటెండ్ అయినా, ఆయ‌న సినిమాల‌కి సంబంధించి ఏ ఈవెంట్ జ‌రిగినా ఆడిటోరియం మొత్తం 'జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్' నినాదాల‌తో మారుమోగిపోతుంది. అయితే, దీనికి సంబంధించి ప్ర‌శ్న అడిగారు ఒక రిపోర్ట‌ర్. మీరు ఎప్పుడు క‌నిపించినా ఆడిటోరియం మొత్తం జై ఎన్టీఆర్ నినాదాల‌తో మారుమోగిపోతుంది ఆయ‌న ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంటుంది? అని అడిగిన ప్ర‌శ్న‌కు విశ్వ‌క్ సేన్ ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. "ఆయ‌న ఇంపాక్ట్ క‌చ్చితంగా నా మీద ఉంటుంది. ఆయ‌నంత గొప్ప న‌టుడు అవ్వాలి అనేంత ఇంపాక్ట్ ఉంటుంది. నిజానికి అంద‌రూ ఆయ‌న్ని గొప్ప స్టార్ అంటారు. నాకు మాత్రం ఆయ‌న గొప్ప న‌టుడు. ఇండియాలోనే గొప్ప యాక్ట‌ర్. ఆయ‌న నాకు స్టార్ కంటే గొప్ప యాక్ట‌ర్" అని అన్నారు. 


సినిమాకి పొలిటిక‌ల్ ట‌చ్.. 


"పోస్ట‌ర్ చూస్తే ఒక‌ప్పుడు తార‌క్.. ఎల‌క్ష‌న్ ప్ర‌చారంలో దండం పెట్టారు. మీరు కూడా అలానే పెట్టిన‌ట్లు అనిపిస్తుంది. ఆయ‌న్ని కాపీ కొట్టారా? ఈ సినిమాకి పొలిటిక‌ల్ ట‌చ్ ఉందా?" అని అడిగితే.. విశ్వ‌క్ సేన్ న‌వ్వుతూ ఫ‌న్ క్రియేట్ చేశారు. "సార్ దండం ఎవ‌రైనా అలానే పెడ‌తారు సార్.. ఇలా రివ‌ర్స్ లో పెట్ట‌లేరు క‌దా?  కావాల‌నే చేశాను. మీకు ఇప్ప‌టికే తెలిసిపోయి ఉండాలి. పొలిటిక్ డ్రామానే ఈ సినిమా. అందుకే, ఖాకీ చొక్కా వేశాను. ఈ సినిమాలో అన్ని ఉంటాయి" అని అన్నారు విశ్వ‌క్ సేన్. 


ఆక‌ట్టుకున్న టీజ‌ర్.. 


ఫుల్ యాక్ష‌న్ సీక్వెన్స్ తో సాగింది 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' టీజ‌ర్. దీంట్లో విశ్వ‌క్ సేన్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఆయ‌న ఆద్యంతం గోదావ‌రి స్లాంగ్ తో అల‌రించారు. దీంతో సినిమా ఓ రేంజ్ లో ఉండ‌బోతుంది అని అనుకుంటున్నారు ప్ర‌తి ఒక్క‌రు. ఇక ఈ సినిమాలో.. 'డీజే' టిల్లు ఫేమ నేహా శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అంజ‌లి కీల‌క పాత్ర పోషించింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.  యువన్ శంకర్ రాజా సంగీత అందించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థల్లో సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాని. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలు. సినిమాకి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన ఫ‌స్ట్ లుక్, పోస్ట‌ర్లు, పాట‌లు అంద‌రినీ తెగ ఆక‌ట్టుకున్నాయి. మే 17న సినిమా రిలీజ్ అవుతుంది. మ‌రి విశ్వ‌క్ ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడో వేచి చూడాలి.


Also Read: మొహమాటంతో కొన్ని సినిమాలు ఒప్పుకొని తప్పు చేశా: అల్ల‌రి న‌రేశ్