Sleeping Environment Tips for Babies : కుటుంబం అనేది పిల్లలతోనే కంప్లీట్ అవుతుంది. అందుకే పిల్లలు పుడితే ఇంటిల్లాపాది సంతోషంగా ఉంటారు. అయితే వారిని పెంచే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అలాంటి వాటిలో నిద్ర కూడా ఒకటి. పిల్లలు పగలంతా పడుకుని అర్థరాత్రి లేపుతారని.. దీంతో సరిగ్గా నిద్ర ఉండట్లేదని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని టిప్స్​తో పిల్లలను నిద్రపోయేలా చేయవచ్చట. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి?


ఈ తరహా నిద్ర సమస్య అనేది పెద్దలపై బాగా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఆఫీస్​కు వెళ్లేవారికి పిల్లలు లేచి ఏడుస్తూ ఉంటే సరైన నిద్ర ఉండదు. ఆ సమయంలో మరొకరు నిద్రను తాగ్యం చేసి.. పిల్లలను చూసుకోవాల్సి వస్తుంది. సరైన నిద్ర లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆఫీస్​కు వెళ్లేవారికి నిద్ర లేకపోవడం వల్ల పనిపై సరిగ్గా ఫోకస్ చేయలేరు. పిల్లలకు కూడా సరైన నిద్రలేకుంటే అది ఇబ్బందిని కలిగిస్తుంది. పేరెంట్స్, పిల్లలు హెల్తీగా ఉండాలంటే నాణ్యమైన నిద్ర అవసరం. అందుకే పిల్లలున్నవారు కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి అంటున్నారు. 


బెడ్​రూమ్​లో డిస్టర్బెన్స్ వద్దు


పిల్లలు పడుకునే ప్లేస్​లో డిస్టర్బెన్స్​, టీవి లాంటివి లేకుండా చూసుకోవాలి. అవి వారి నిద్రను పాడుచేస్తాయి. దీనివల్ల వారు నిద్రలేచి.. మళ్లీ నిద్రరాక ఇబ్బంది పడుతూ.. ఏడుస్తూ ఉంటారు. దీనివల్ల పెద్దవారికి, చిన్నవారికి కూడా నిద్ర భంగం అవుతుంది. కాబట్టి బెడ్​రూమ్​ ప్రశాంతంగా.. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేలా చూసుకోండి. రూమ్ టెంపరేచర్​ కూడా నిద్రను భంగం చేస్తుంది. కాబట్టి మీ బెడ్ లేదా పిల్లల తొట్టి వేడిని బట్టి రూమ్​ని మరీ చల్లగా, వేడిగా కాకుండా చూసుకోవడం మంచిది. 


పిల్లల పరుపు అలా ఉండాలి..


పిల్లలు, పెద్దలు నిద్రించే పరుపుపై కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇది భద్రత, మనశ్శాంతి రెండింటీని ఇస్తుంది. కాబట్టి పిల్లల పడుకునే ప్రాంతంలో ఎలాంటి రాజీ పడకూడదు. స్నగ్ కాటన్ కవర్​తో వచ్చే పరుపులను వారికోసం ఎంచుకోవచ్చు. పిల్లలకు ఊపిరాడకుండా చేసే దిండ్లు, పరుపులు, దుప్పట్లు లేకుండా చూసుకోండి. వారికి స్మూత్​గా, హాయినిచ్చే దుప్పట్లు వాడితే మంచిది. లేదంటే గాలి సరిగ్గా తగలక.. చెమట చిరాకుతో నిద్రలేస్తారు. 


స్లీప్ వేర్​పై ప్రత్యేక శ్రద్ధ 


పిల్లలు పడుకున్నప్పుడు వారు కంఫర్ట్​బుల్​ దుస్తుల్లో ఉన్నారో లేదో చెక్ చేయండి. నైట్ స్లీప్​వేర్ కంఫర్ట్​గా ఉండేలా చూసుకోండి. రూమ్​లో ఏసీ లేదా ఫ్యాన్స్ ఉపయోగిస్తే.. పిల్లను వాటి గాలి తగిలేలా నేరుగా ఉంచకండి. గాలి తగిలేలా ఉంచాలి కానీ.. నేరుగా మొహం మీదకి విండ్ వచ్చేలా పడుకోబెట్టకూడదు. ఇలా చేస్తే పిల్లలకు జలుబు చేస్తుంది. ఊపిరి ఆడక సరిగ్గా నిద్రపోలేరు. అలాగే రూమ్ మరీ వేడిగా, మరీ చల్లగా కాకుండా.. పిల్లలు తట్టుకోగలిగే ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకోవాలి. 


ఇవి పిల్లలు ఎదిగేకొద్ది వారికి మెరుగైన నిద్రను అందించేలా చేస్తాయి. పిల్లలలో రోగనిరోధక శక్తి పెరగడంలో, వారి ఎదుగుదలలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది. వారితోపాటు మీరు కూడా హాయిగా నిద్రపోయే సౌలభ్యం ఉంటుంది. పిల్లల్లో నిద్ర సైకిల్ బట్టి కూడా వారి నిద్ర ఉంటుంది కాబట్టి.. కాస్త ఓపికగా ట్రై చేస్తే పిల్లలు హాయిగా, త్వరగా నిద్రపోతారు. 


Also Read : సమ్మర్ స్పెషల్ లుక్స్​.. బీచ్​ నుంచి ఫంక్షన్లవరకు ఇలాంటి డ్రెస్​లను ఎంచుకుంటే అదిరిపోతారంతే