Cholera outbreak in India: దేశ వ్యాప్తంగా వానలు జోరందుకున్నాయి. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. వాతావరణం మారడంతో  సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రమాదకరమైన కలర వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేరళతో పాటు గుజరాత్ లో కలరా కేసులలను అధికారులు గుర్తించారు. రాజ్ కోట్ లోని లోహానగర్ లో రెండు కలరా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కలరా కేసు నమోదైన ప్రాంత నుంచి రెండు కిలో మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని కలరా ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. రెండు నెలల పాటు ఈ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. ఐస్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను నిషేధించారు. కలరా కట్టడికి 25 బృందాలతో చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

  


కేరళలోనూ కలర కేసులు


కేరళలోని ఓ ప్రైవేట్ కేర్ హోమ్ లో కలరా కలకలం రేపింది. తిరువనంతపురంలోని నెయ్యట్టింకర ప్రాంతంలో కలరా కేసు నమోదైనట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ వెల్లడించారు. తొలుత ఫుడ్ పాయిజనింగ్ గా భావించినా, ఆ తర్వాత కలరాగా గుర్తించినట్లు చెప్పారు. హాస్టల్ లో నివాసం ఉంటున్న 10 ఏండ్ల చిన్నారికి కలరా నిర్ధారణ కావడంతో నివారణ చర్యలు చేపట్టారు. మరో 22 మంది విద్యార్థులలోనూ కలరా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది.


కలరా ఎలా సోకుతుందంటే?  


కలరా అనేది విబ్రియో కలరా అనే బాక్టీరియాతో సోకుతుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. కలరా ప్రధానంగా కలుషిత నీరు, కలుషిత ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. కలరా సోకిన వారిలో అతిసారం, వాంతులు కలుగుతాయి. కలరా బ్యాక్టీరియా చిన్న ప్రేగుల్లో ప్రవేశించి విరోచనాలు, వాంతులకి కారణమవుతుంది. వర్షకాలంలో కలుషిత నీటిని తాగడం, అపరిశుభ్రమైన రోడ్ సైడ్ ఆహారం తీసుకోవడం వల్ల కలరా వ్యాపిస్తుంది. కలరా బాక్టీరియా ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీసి పలు సమస్యలకు కారణం అవుతుంది.  


కలరా లక్షణాలు:


⦿ వికారం


⦿ వాంతులు


⦿ డీహైడ్రేషన్


⦿  బీపి తగ్గడం


⦿  నీరసం


⦿  హార్ట్ బీట్ పెరగడం


⦿  కండరాల తిమ్మిరి


ఈ లక్షణాలు కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి. సరైన చికిత్స తీసుకోవాలి. కలరా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సుమారు రెండు వారాలకు లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు బయటపడిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.


కలరా చికిత్స:


⦿ కలరా లక్షణాలు ఉన్నా వాళ్లు ఓఆర్ఎస్ తీసుకోవాలి.


⦿ నీరసం నుంచి బయటపడేందుకు నోటి ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి.


⦿  అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు యాంటీ బయాటిక్స్ వాడాలి.
 


కలరా సోకిన వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


⦿  కలరా సోకిని వాళ్లు ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి.


⦿  వాష్ రూమ్ కు వెళ్లిన ప్రతిసారి సబ్బుతో చేతులు కడుక్కోవాలి.


⦿ షేక్ హ్యాండ్ ఇవ్వడం మానుకోవాలి.


⦿ వీలైనంత వరకు బయటి ఫుడ్ తీసుకోకూడదు.


⦿  స్వచ్ఛమైన నీరు, ఆహారం తీసుకోవాలి.


⦿ కాచి చల్లార్చిన నీటిని తాగాలి.



Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త