Mangoes: పండ్లలో రారాజు మామిడి పండు. మనదేశంలో వీటికి అభిమానులు ఎక్కువ. వేసవి వచ్చిందంటే మామిడి పండ్లు మార్కెట్లో కుప్పలుగా పోసి అమ్ముతారు. ఇది ఎంతోమందికి ప్రియమైన పండు. కొంతమంది మార్కెట్లలో నేరుగా పండ్లను కొంటూ ఉంటే, మరికొందరు ఈ కామర్స్ సైట్లలో ప్రముఖ కిరాణా డెలివరీ యాప్‌లలో కూడా మామిడి పండ్లను ఆర్డర్ పెడుతున్నారు. అలాంటి ఒక ప్రముఖ డెలివరీ యాప్ జెప్టో. ఇది కేవలం పావుగంటలో లేదా అరగంటలో ఇంటికి డెలివరీ చేస్తుంది. కేవలం ఒక్క నెలలోనే ఈ యాప్ నుంచి పాతిక కోట్ల రూపాయల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారు. అంటే ఒక్క రోజుకు 60 లక్షల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నమాట. మిగతా ఈ కామర్స్ సైట్లు,  స్థానిక మార్కెట్లలో అంతకుమించి  పండ్లు అమ్ముడుపోయి ఉంటాయి. దీన్నిబట్టి ఈసారి మామిడి పండ్లు వందకోట్ల వ్యాపారాన్ని చేసే అవకాశం ఉంది. 


మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా ఎక్కువ మంది ఆర్డర్ పెట్టింది ఆల్ఫోన్సో  జాతి పండ్లను.  30 శాతం మంది ఈ మామిడిపండ్లనే ఆర్డర్ పెట్టారు.  ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే వారు ఈ మామిడిపండును తినేందుకు ఆసక్తి చూపించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఆర్డర్ పెట్టిన పండు బంగినపల్.లి దాదాపు పాతిక శాతం మంది ఈ మామిడిపండును తినేందుకు ఆసక్తి చూపించారు. తరువాత కేసర్ మామిడి పండ్లను కూడా చాలామంది ఆర్డర్ చేశారు.  రత్నగిరి, దేవగడ్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆల్ఫోన్సో పండిస్తారు. ఇక్కడ హానికరమైన కార్బైడ్లు లేకుండా సహజంగా పండ్లను పండిస్తారు. 


ఎన్నో ప్రయోజనాలు
మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ పండ్లు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు వీటిని మితంగా తినాలి. దీనిలో విటమిన్ సి, పెక్టిన్ అధికంగా ఉంటుంది. మామిడి పండును తినడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. ఈ పండ్లు తినడం వల్ల క్యాన్సర్ ను తట్టుకునే శక్తి వస్తుంది. మగవారు వీటిని తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనిలో మాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ లెవెల్స్ ను సమతుల్యంగా ఉంచుతుంది. ఈ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 



Also read: ప్రతివారం ఒక పిజ్జా తింటున్నారా? అయితే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.