Costliest Ice Cream: ఐస్ క్రీములు అధికంగా అమ్ముడుపోయేది వేసవికాలంలోనే. ప్రజలు వేడి వాతావరణం నుంచి తప్పించుకోవడం కోసం చల్లని పదార్థాల వైపు ముగ్గు చూపిస్తారు. అందుకే ఐస్ క్రీములు తెగ తింటూ ఉంటారు. పిల్లలకైతే ఐస్‌క్రీమ్‌కు పెద్ద అభిమానులు.  ఐస్ క్రీమ్ ఇస్తే చాలు వారి ఆనందం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఐస్ క్రీము పది రూపాయల నుంచి  200 రూపాయల వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ ఒకటి ఉంది. ఇది తినాలంటే లక్షల ఖర్చు పెట్టాలి. ఈ ఐస్ క్రీము ధరతో చిన్న కారు కొనేయచ్చు. 


గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్ సైట్ చెబుతున్న ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ తినాలంటే 5 లక్షల 20వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇది జపాన్‌కు చెందిన సెల్లాటో అనే కంపెనీ దీన్ని తయారుచేసి అమ్ముతోంది. ఈ హిమక్రీముకు ‘బైకుయా’ అని పేరు పెట్టింది. ప్రముఖ వంటగాడు తదయోషి యమడ దీన్ని ఏడాదిన్నర పాటూ కష్టపడి తయారు చేశారు. బంగారు ఆకులతో దీన్ని తయారు చేశారు. అతని ఆలోచనల నుంచి పుట్టిన ఫ్యూజన్ వంటకం ఇది. జపాన్లో దీన్ని తినే వారి సంఖ్య చాలా తక్కువ. కేవలం అధిక ధనవంతుల మాత్రమే ఈ ఐస్ క్రీమ్ రుచి చూడగలరు. ఇది ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. దీనికన్నా ఖరీదైన ఐస్ క్రీమ్ ఇంతవరకు తయారవ్వలేదు. 



రుచి ఎలా ఉంటుంది?
దీని రుచి ఎలా ఉంటుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఐస్ క్రీమ్ మంచి సువాసన వెదజల్లుతుంది. పండ్లతో తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ నుంచి ఒక బలమైన సువాసన వస్తుంది. ఆ సువాసన అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది. చాలా ప్రయత్నాలు చేశాక, ఎలాంటి లోపాలు లేకుండా అద్భుతమైన రుచిని పొందే వరకు ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి ఇది మంచి రుచితో తయారయింది. దీని ఖరీదు ఎక్కువ కావడంతో అత్యంత ఖరీదైన హిమక్రీముగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.  



Also read: పీతలు ఇప్పుడు తింటున్నాం కానీ ఒకప్పుడు పొలాలకు ఎరువుగా వాడేవారు, ఎందుకో తెలుసా?























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.