Hindu Marriage System: షోడశ సంస్కారములలో మొదటిది గర్భాదానము (First Night). దేనినే "అదానము" అని కూడా అంటారు. సంతానం తల్లి తండ్రుల  హృదయం, శరీరం నుంచి జన్మిస్తారు. అందుకే తల్లిదండ్రులకు స్థూల, సూక్ష్మ, శరీరాల్లో ఏఏ దోషాలు ఉంటాయో ఆయా దోషాలు వారి వారి సంతానానికి కూడా సంక్రమిస్తాయి. అందుకే భార్య భర్త మంచి కాలంలో సత్వగుణంతో ఉంటూ..మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉన్నప్పుడే ఆ సమయంలో పడిన బీజం సక్రమమైన సంతానాన్నిస్తుంది. ఈ విషయమును గురించి శ్రీ కృష్ణుడు గీతలో ఇలా అన్నాడు.


 "ధర్మవిరుద్దో భూతేషు కామోస్మి భరతర్షభ" 
(మనుష్యులందు ధర్మ విరుద్దము కాని కామము తానై ఉన్నాను)


శరీరానికి సంబంధించినది కాదు పవిత్రమైన మనసుకి సంబంధించినది అని తెలియజేస్తూ..
ఓం పూశాభాగం సవితామే దదాతు|
ఓం విష్ణు యోనిం కల్పయితు||


అందుకే ఈ మంత్రాలు గర్భాదాన సంస్కార సమయంలో పఠిస్తారు. 


అప్పట్లో బాల్య వివాహములు జరిగేవి. ఆ దంపతులు యుక్త వయస్కులైన తర్వాత మంచి మహూర్తం చూసి గర్భాదానం(First Night) ముహూర్తం నిర్ణయించేవారు. గర్భాదానం రోజు ఉదయం పునస్సంధానం చేసేవారు..అంటే అగ్ని హోత్రాన్ని వివాహానంతరం, గర్భాదానం రోజున తిరిగి ప్రతిష్టించి హోమం చేసేవారు. అప్పట్లో బాల్య వివాహం కాబట్టి రజస్వల తర్వాత మరోసారి హోమం చేసి గర్భాదాన ముహూర్తం నిర్ణయించేవారు. ఇప్పుడు పెళ్లిళ్లన్నీ రజస్వల తర్వాతే జరుగుతున్నాయి కాబట్టి పెళ్లిలో జరిపించే క్రతువు సరిపోతుంది. సాధారణంగా దీనికి మంచి మహూర్తం చూడాలి కానీ..పెళ్లైన రెండు మూడు రోజుల్లో జరిపించేస్తున్నారు..ఇంకొందరు పెళ్లికి ముందే తొందరపడుతున్నారు. ఇది శాస్త్రసమ్మతం ఎంతమాత్రం కాదు.


Also Read: చాణక్య నీతి: పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది


గర్భాదానం ఎప్పుడు చేయాలి ఎప్పుడు వద్దు


షోడశ కర్మలలో మొదటిది, జీవి ఆవిర్భావానికి ముందే జరిపే ముఖ్యమైన సంస్కారం గర్భాదానం. గర్భాదానం వల్ల పిండోత్పత్తి జరిగి జీవి పుట్టుకకు బీజం పడుతుంది. ఇంత పవిత్రమైన కార్యాన్ని జరిపించేందుకు కొన్ని నియమాలున్నాయి.



  • స్త్రీలకు రాజోదర్శనం నుంచి మొదటి పదహారు రాత్రులను ఋతురాత్రులు అంటారు. అందులో మొదటి నాలుగు రోజులు గర్భాదానం పనికి రాదు

  • పురుష రాశులైన మేషం, మిధునం, సింహం, తులా, ధనుస్సు, కుంభంలో బృహస్పతి సంచరిస్తున్న సమయంలో గర్భాదాన లగ్నానికి లగ్న, పంచమ, నవమ స్థానాల్లో ఉన్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయిస్తే పుత్ర సంతానము కలుగుతుందంటారు

  • స్త్రీ రాశులైన వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మకరం, మీన రాశుల్లో  పంచమ నవమ స్థానాల్లో బృహస్పతి లేకుండగా గర్భాదాన మహూర్తం నిర్ణయిస్తే స్త్రీ సంతానం కలుగుతుందని శాస్త్రవచనం

  • గర్భాదానం సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో...పగటివేళ పనికిరాదు

  • పంచ పర్వములైన కృష్ణాష్టమి, కృష్ణ చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రమణ రోజుల్లో, శుక్ల చతుర్దశిలో ఏకాదశి లాంటి వ్రత దినాలు, శ్రాద్ధ దినాల్లో, పాపగ్రహాలతో కూడిన నక్షత్రాల సమయంలో గర్భాదాన ముహూర్తానికి పనికిరాదు

  • భార్యభర్తల రాశికి ఎనిమిదో స్థానంలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు గర్భాదాన ముహూర్తం నిర్ణయించరాదు


Also Read: ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


శాస్త్ర ప్రకారం గర్భాదాన ముహూర్తం నిర్ణయించకపోతే...


గర్భాదాన ముహూర్తం గురించి ఇప్పటి జనరేషన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివలన సత్సంతానం కలగడం లేదని బాధపడుతున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడి జననం. సంతానవాంఛతో తన దగ్గరకు వచ్చిన దితితో...భర్త కశ్యప ప్రజాపతి.... "ఇది సాయం సంధ్యాసమయం ఇది గర్భాదానానికి తగిన సమయం కాదు" అని వారించినా వినదు. కూడని సమయంలో భార్య కోర్కె తీర్చడం వల్ల లోకకంఠకుడైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు జన్మించారు. అందుకే మంచి ముహూర్తం చూసి బృహస్పతి ఐదో స్థానంలో ఉన్నప్పుడు శుభముహూర్తం నిర్ణయిస్తారు. ఎందుకంటే పంచమం ప్రేమ స్థానంగా చెబుతారు...ఆ సమయంలో అదానము అంటే ఉంచడం.. గర్భాదానం అంటే గర్భంలో ఉంచడం అని అర్థం.