Pizza: పిజ్జా రోజూ తినడం లేదు కదా వారానికోసారి తింటే ఏమవుతుంది అనుకునేవారు ఎంతోమంది. అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పిజ్జా అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో ఒకటి. ఇది జంక్ ఫుడ్ కేటగిరిలోకే వస్తుంది. దీని రుచి  మనుషులను తనకు బానిస చేసుకునేలా ఉంటుంది. అందుకే పిజ్జాను తినడం అలవాటు చేసుకుంటే అది తినకుండా ఉండలేరు. అది గుర్తొస్తే చాలు తినాలన్న కోరిక మనసులో పెరిగిపోతుంది. రోజు తినేందుకు కొంతమంది భయపడతారు, బరువు పెరుగుతామేమో అని అనుకుంటారు. అందుకే వారినికోసారి పిజ్జా తినడం అలవాటు చేసుకుంటారు. అలా తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు కలగవని అనుకుంటారు. అది పూర్తి అపోహ. వారానికోసారి పిజ్జా తిన్నా కూడా శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. 


గుండె సమస్యలు
వారానికోసారి పిజ్జా తినడం అలవాటుగా మార్చుకుంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్టే. వాటిలో ప్రాసెస్ చేసిన మీట్ వాడతారు. వాటిని టాపింగ్స్ పై పిజ్జాపై వేస్తారు. కాబట్టి పిజ్జా తినడం వల్ల సంతృప్త పువ్వులు ఎక్కువగా శరీరంలో చేరే అవకాశం ఉంది. అలాగే పిజ్జా బేస్‌ను మైదాతో తయారుచేస్తారు. ఇది మరీ ప్రమాదకరం. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరిగిపోతుంది. శరీరంలో హానికరమైన పరిణామాలు జరుగుతాయి. 


బరువు పెరగడం
సాదా చీజ్ పిజ్జాలో ఒక ముక్క తింటే శరీరంలో 400 క్యాలరీలు చేరుతాయి. ఇక రెండు నుంచి మూడు ముక్కలు తింటే ఎనిమిది వందల నుండి 1200 క్యాలరీలు చేరే అవకాశం ఉంది. ఆ రోజు తినే ఇతర ఆహారాలు కూడా జత అయితే ఒక్కరోజులోనే 2000 క్యాలరీలు శరీరంలో చేరినట్టే. ఇది చాలా హానికరం. శరీరం భరించలేని క్యాలరీలు లోపల చేరి బరువు త్వరగా పెరిగిపోతారు.


క్యాన్సర్ వచ్చే ప్రమాదం
పిజ్జాలో ప్రాసెస్ చేసిన మాంసాలను పైన వాడతారు. ఇవి అధిక కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల పేగు, పొట్ట క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. 


తినడం మానేయాలా?
పిజా తినడం పూర్తిగా మానేయమని మేము చెప్పడం లేదు. వారానికి ఒకసారి తినే బదులు నెలకి ఒకసారి తినండి. దీనివల్ల ఎక్కువగా హాని కలగదు. పిజ్జా తిన్న రోజు ఇతర ఆహారాలను తగ్గించండి. దీనివల్ల శరీరంలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా చేరుకునే అవకాశం ఉండదు. అలాగే పిజ్జా బేస్‌‌ను మీరే ఇంటి దగ్గర తయారు చేసుకోండి. బయట మైదాతో చేసిన బేస్ దొరుకుతుంది. మీరు గోధుమ పిండితో తయారు చేసిన బేస్‌ను తయారు చేసుకొని ఇంట్లోనే పిజ్జాను రెడీ చేయండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. 



Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ఇది, దీని ఖరీదుతో కారు కొనేయచ్చు
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.