తొమ్మిది రోజుల పాటూ వేడుకలా సాగే పండుగ బతుకమ్మ. ఆడపడుచులే ఏడాదంతా ఎదురుచూసేది ఈ పండుగ కోసమే. తమను, తమ కుటుంబాన్ని, ఈ పర్యావరణాన్ని చల్లగా కాపాడమని ఆ అమ్మవారిని బతుకమ్మ రూపంలో కొలుచుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైభవంగా నిర్వహిస్తుంది. ఈ తొమ్మిదిరోజుల్లో అసలైన పండుగ తొమ్మిదో రోజైనా సద్దుల బతుకమ్మ. ఆ రోజు అయిదు రకాల నైవేద్యాలతో అమ్మవారిని కొలుచుకుంటారు. అందులో కచ్చితంగా వండే ప్రసాదం మలీద లడ్డూలు. వీటిని తయారు చేయడం చాలా సులువు. వీటి స్పెషాలిటీ ఏంటంటే చపాతీలతో చేసే లడ్డూలు ఇవి. రుచి కూడా అదిరిపోతుంది.

కావాల్సిన పదార్థాలుగోధుమ పిండి - ఒక కప్పుబొంబాయి రవ్వ - అరకప్పుపాలు - అర కప్పునట్స్ - గుప్పెడు(జీడిపప్పు, బాదం, పిస్తా)ఉప్పు - రుచికి సరిపడాబెల్లం తురుము- ఒక కప్పుసోంపు పొడి - అర టీస్పూనుయాలకుల పొడి - ఒక టీస్పూను

తయారీ ఇలా1. గోధుమ పిండిని, రవ్వను ఒక గిన్నెలో వేసి బాలా కలపాలి. అందులో నెయ్యిని కాచి వేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలపాలి. 2. ఆ తరువాత పాలు వేసి బాగా కలిపి, చపాతీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. 3. ఓ పావుగంట తరువాత మీడియం సైజుల్లో ఉండగా చుట్టుకుని చపాతీల్లా ఒత్తుకుని కాల్చాలి. 4. ఓ కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తాలు సన్నగా తరిగి వేయించుకోవాలి. 5. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. 6. ఇప్పుడు ఒక గిన్నెలో చపాతీను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వీలైతే ఓసారి మిక్సీలో కచ్చపచ్చాగా రుబ్బుకోవాలి. నీళ్లు చేరనివ్వకూడదు. 7. ఒక గిన్నెలో చపాతీ పొడిని వేసి, అందులో బెల్లంగా తరుగును వేయాలి. 8. అందులో కాచిన నెయ్యిని, ముందుగా వేయించుకున్న నట్స్‌ తరుగును, యాలకుల పొడి కూడా అందులో కలపాలి. 9.అన్నింటినీ బాగా కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. 10. అంతే మలీద లడ్డూ తయారైనట్టే. 

Also read: బతుకమ్మ ఎన్నిరోజుల పండుగ, ఏ రోజు ఏ బతుకమ్మని పూజిస్తారు!

బతుకమ్మ ఎప్పుడు ప్రారంభమైందిబతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు కానీ..వేల సంవత్సరాల నుంచీ ఇది కొనసాగుతూ వస్తోందని చెప్పేందుకు చాలా కథలు చెబుతారు. అందులో ముఖ్యమైనది అమ్మవారి కథ. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్చపోయిందట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా కలిసి గుమిగూడి పాటలు పాడారట. ‘బతుకమ్మా’ అంటూ ఆమెను వేడుకున్నారట. సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందట. అప్పటి నుంచీ ఆమె స్థానంలో పూలను ఉంచి పూజించడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల్లో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు.. ఆ ఒక్కరోజు అమ్మవారు అలుగుతుందని అందుకే అలిగిన బతుకమ్మ అంటారని చెబుతారు.

Also read: తొమ్మిది రోజులు బతుకమ్మ ఇష్టపడే నైవేద్యాలు ఇవే, నిమిషాల్లో రెడీ చేసేయచ్చు

Also read: నువ్వుల సద్ది, సద్దుల బతుకమ్మ స్పెషల్ నైవేద్యం, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది