Homemade Mayonnaise Recipe : కల్తీ, శుభ్రం లేని మయోనైజ్ తిని హైదరాబాద్​లో ఓ యువతి చనిపోయింది. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. అందుకే ఈ మయోనైజ్​ను బాన్ చేయాలని జీహెచ్​ఎంసీ ప్రభుత్వానికి సూచించగా.. తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం పాటు.. దీనిని బ్యాన్ చేసింది. అయితే గుడ్డుతో చేసే మయోనైజ్​ మాత్రమే ఉపయోగించకూడదు. వెజిటేబుల్, శాచ్యూరేటడ్ మయోనైజ్ ఉపయోగించవచ్చంటూ మినహాయింపు ఇచ్చింది. అయితే మయోనైజ్ ఎక్కువ చోట్ల దొరకదు అనమాట. కానీ మీరు దీనిని ఇంట్లో కూడా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. 


ఏది ఏమైనా.. మనం ఇంట్లో తయారు చేసుకుని తిన్నదానికి.. బయట తిన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సొంతంగా చేసుకునేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ నచ్చిన వంటలు తయారు చేసుకుంటాం. పైగా శుభ్రంగా చేసుకుంటాం. అలా చేసుకున్న వాటిని తినేప్పుడు కూడా మంచి తృప్తి ఉంటుంది. అలా మీకు మయోనైజ్ ఇష్టమనుకుంటే.. మీరు దానిని ఇంట్లో తయారు చేసుకుని కూడా తినొచ్చు. మరి దానిని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.


కావాల్సిన పదార్థాలు 


గుడ్లు - 2


నిమ్మసరం లేదా వెనిగర్ - 1 టేబుల్ స్పూన్


ఉప్పు - అర టీస్పూన్


పెప్పర్ - పావు టీస్పూన్


నూనె - 1 కప్పు


తయారీ విధానం.. 


గుడ్లలోని పచ్చసొనను జాగ్రత్తగా వేరు చేయాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్​లో రెండు పచ్చసొనలు వేసి.. ఆ రెండింటీని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దానిలో నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి.. అన్ని బాగా మిక్స్ అయ్యేదాక కలుపుతూనే ఉండాలి. దీనిలో కొద్ది కొద్దిగా నూనెను వేస్తూ.. కలుపుతూ ఉండాలి. ఎంతబాగా కలిపితే.. అంత త్వరగా దాని టెక్చర్ మారుతుంది. క్రీమిగా.. మంచి థిక్​నెస్​తో వస్తుంది. ఇలా పది నిమిషాలు కలిపితే.. మయోనైజ్ రెడీ. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


పదార్థాలన్నీ రూమ్ టెంపరేచర్​లోనే ఉండాలి. నూనె బాగా మిక్స్​ అయ్యేవరకు దానిని బాగా కలపాలి. లేదంటే నూనె విడిపోతుంది. నూనెను ఒకేసారి వేసి కాకుండా కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. దాని రుచిని చూసి.. మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. మయోనైజ్ నూనె నుంచి విడిపోతే.. కాస్త నీళ్లు వేసి మళ్లీ కలపాలి. అప్పటికీ కాకుంటే మళ్లీ మొదటినుంచి చేసుకోవాలి. బాగా చిక్కగా ఉంటే.. కాస్త నీళ్లు లేదా నిమ్మరసం వేసుకోవాలి. బాగా వదులుగా ఉంటే.. కొంచెం నూనె వేసుకోవచ్చు. 


ఫ్లేవర్స్..


గార్లిక్ రుచిని ఇష్టపడేవారు రెండు వెల్లుల్లి రెబ్బలను మ్యాష్ చేసి వేసుకోవచ్చు. పార్స్లీ రుచి ఇష్టముంటే వాటి హెర్బ్స్ మిక్స్ చేసుకోవ్చచు. కానీ ఫ్రెష్​గా ఉండాలి. కారం ఇష్టపడేవారు.. రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసి స్పైసీ మయోనైజ్ వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మయోనైజ్​ను ఫ్రిడ్జ్​లో వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. వేడికి, సూర్యరశ్మికి దానిని దూరంగా ఉంచాలి. దీనిని మీరు ఇంట్లో చేసుకునే ఎన్నో ఫుడ్స్​లో ఉపయోగించుకోవచ్చు. 



సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే.. 


బయట కూడా మయోనైజ్​ను ఇలా చేస్తారు. కానీ.. సరైన శుభ్రత తీసుకోకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. గుడ్లపై ఉన్న డస్ట్ పచ్చసొనలోకి పడిపోయినా.. వాటినే వాడడం.. చేతులు శుభ్రం చేసుకోకుండా దీనిని తయారు చేయడం. పరిమితి దాటిపోయినా వాటినే వినియోగించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇంట్లో చేసుకునేప్పుడు దానిని జాగ్రత్తగా చేసుకుంటే మంచి రుచి మీ సొంతమవుతుంది. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. 



Also Read : హైదరాబాద్ స్ట్రీట్​ ఫుడ్​ అంతా విషమేనా? మోమోలు, షవర్మాలు తినేవారు జాగ్రత్త.. ఆ ఒక్కటే కొంపముంచేస్తోందట