ఆకాశంలో అద్భుత ఘట్టం. వందేళ్లకి ఓసారి ఏర్పడే అపురూపం. ఈ శతాబ్ధంలోనే అతి సుదీర్ఘ చంద్రగ్రహణాన్ని ప్రజలు వీక్షించబోతున్నారు. ఈ చంద్రగ్రహణం ఏకంగా మూడు గంటల 28 నిమిషాల పాటూ కొనసాగబోతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. గ్రహణ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో ఎర్రగా మెరిసిపోతాడు. సూర్యుడి వెలుగును భూమి అడ్డుకోవడం వల్ల చంద్రుడిలో 97శాతం భాగం ఇలా ఎరుపు రంగులో కనిపించి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడతుందని చెబుతోంది నాసా. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. 


చంద్రగ్రహణం అంటే...
భూమి పరిభ్రమిస్తూ ఒక సమయంలో చంద్రునికి, సూర్యునికి మధ్యలోకి వస్తుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. ఈసారి 97శాతం చంద్రుడిని కనిపించకుడా భూమి అడ్డుకోబోతోంది. అందుకే పాక్షిక చంద్రగ్రహణం అని పిలుస్తున్నాం. 


ఎప్పుడు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది?
నాసా చెప్పిన ప్రకారం ఉత్తరమెరికా, యూరోప్ దేశాల్లో నవంబర్ 18, 19 తేదీలలో ఈ అద్భుతం జరగనుంది. నవంబర్ 18 అర్థరాత్రి మొదలై నవంబర్ 19 తెల్లవారు జామున గ్రహణం ముగుస్తుంది. 


మనదేశంలో ఎప్పుడు?
భారత కాలమనం ప్రకారం నవంబరు 19న శనివారం మధ్యాహ్నం12. 48 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మధ్యహ్నాం రెండున్నరకు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. 4.17 నిమిషాలకు ముగుస్తుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల వారికీ ఈ అద్భుతాన్ని చూసే అవకాశం లేదు. కేవలం ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం ప్రజలు చూడగలరు. అది కూడా మబ్బులు కమ్మకుండా వాతావారణం అనుకూలించాలి. తెలుగు రాష్ట్రాల వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడలేరు.


ఏ దేశాల వారు చూడొచ్చు?
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు చూడొచ్చు. అలాగే దక్షిణ అమెరికాలోని మెక్సికో ప్రజలు కూడా వీక్షించవచ్చు. ఆస్ట్రేలియా, యూరోప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల వారు చూడగలరు. 


ఆన్ లైన్ లో చూడొచ్చు
ఈ చంద్రగ్రహణాన్ని చూడలేని వారి కోసం కొన్ని వెబ్ సైట్లు ఆన్ లైన్ లో ఈ అద్భుతాన్ని ప్రసారం చేయబోతున్నాయి. timeanddate.com, livescience.com వంటి వెబ్ సైట్లో మీరు వీక్షించవచ్చు.


Also read: కాకరకాయను వీళ్లు తినకూడదు... తింటే సమస్యలు తప్పవు


Also read: సముద్రపు చేపలే ఆరోగ్యానికి మంచివంటున్న అధ్యయనాలు... తింటే ఎన్ని లాభాలో
Also read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి