Health Benefits of Bitter Gourd: కాకార కాయను శాస్త్రీయంగా మోమోర్డికా మొమోర్డికా కరన్షియా, కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. ఇది ఉష్ణమండలాల్లో ఎక్కువగా సాగు చేసే లేదా పెరిగే తీగ జాతి మొక్క. మనం కూర చేసుకుని తినే కాకరకాయలు ఈ మొక్కకు చెందిన ఫలంగా చెప్పవచ్చు.
చేదుగా ఉండే కాకరలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో కాకరకాయలో విటమిన్ A, C, మరియు B సమృద్ధిగా ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, మరియు డైటరీ ఫైబర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే కూరగాయ. ఇది పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉండి, అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కాకరకాయతో ఉన్న 8 ముఖ్యమైన ఉపయోగాలు ఇవి:
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
కాకరకాయలో "కారాంటిన్" అనే ఒక సమ్మేళనం ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల, ఇది మధుమేహం (డయాబెటిస్) బాధితులకు ఎంతో ప్రయోజనకరమైన ఆహారం.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి
కాకరకాయ జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉండడం, బలబద్దకం తగ్గిస్తుంది. పెద్ద పేగు నుంచి మలినాలను పూర్తిగా తొలగించడంలో జీర్ణప్రక్రియ మరింత సమర్థ వంతంగ జరిగేందుకు కాకర చాలా ఉపయోగకరం.
ఇన్ఫెక్షన్లకు నివారణ
కాకరకాయలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీరంలోని హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటానికి సంసిద్ధం చేస్తుంది.
డిటాక్సిఫికేషన్
కాకరకాయ శరీరంలోని వ్యర్థాలను తొలగించి, ఇది రక్తాన్ని శుభ్రపరచడం వల్ల మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు తగ్గిస్తుంది.
క్యాన్సర్ నివారణి
కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌ను తొలగించడం వల్ల క్యాన్సర్ ముప్పు ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. కొన్ని అధ్యయనాలు కాకరకాయను క్యాన్సర్ నిరోధకం అని కూడా చెబుతున్నాయి.
రోగనిరోధకతకు
కాకరకాయలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది, ఈ విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఫలితంగా మెరుగుపరచి, వ్యాధులను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
బరువు తగ్గేందుకు
కాకరకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి, కానీ కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. ఇది బరువు తగ్గడాలని అనుకునే వారికి ఇది మంచి పోషకాహారం. శరీరంలోని అధిక కొవ్వు తగ్గించి బరువు నియంత్రణలో ఉంచుతుంది.
చర్మ, జుట్టు ఆరోగ్యానికి
కాకరకాయ రక్తాన్నిశుద్ధి చేస్తుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యాం మెరుగవుతుంది. చర్మ సమస్యలు, అలెర్జీలు, జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. ఫలితంగా కాకరకాయతో సహజంగా ఆరోగ్యంతో మెరిసే చర్మం, జుట్టు సొంతం చేసుకోవచ్చు.
లివర్ ఆరోగ్యానికి
కాకరకాయ లివర్ పనితీరును మెరుగుపరచి, లివర్ డిటాక్సిఫికేషన్ కు తోడ్పడుతుంది
కాకరకాయను పౌడర్, టాబ్లెట్ రూపంలో తీసుకోవడం, కాకరకాయ రసం తాగడం వంటి పద్ధతుల్లో ఆయుర్వేదం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయ చేదుగా ఉంటుంది కనుక చేదు తగ్గేందుకు రకరకాల పద్ధతుల్లో భారతీయ వంటల్లో రుచిగా వండుతుంటారు. చేదైనా ప్రత్యేక రుచికలిగిన కాకరకాయను అసలు మిస్స్ చెయ్యకుండా తినాలి.
Also Read : ఈ రెగ్యూలర్ ఫుడ్స్‌తో లైంగిక ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. శృంగార జీవితానికి ఇవి చాలా మంచివట