Sambrani dhoopam benefits : సాంబ్రాణి ధూపం  వేయడం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వస్తుంది. ఇంట్లో ధూపం వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే ధూపం వేయడం పురాతన కాలం నుంచి మన ఆచారంగా వస్తుందని తాంత్రికవేత్తలు చెప్తుంటారు. రెగ్యులర్‌గా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లోని నెగెటివ్‌ ఎనర్జీ పోతుందని నమ్ముతుంటారు. అయితే  కొన్ని విధి విధానాలు పాటిస్తూ  ధూపం వేయడం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా బయటకు పోతుందని పండితులు  చెప్తున్నారు.


   అయితే దరిద్ర దేవత ఇంట్లో ఉందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ అన్నం, పప్పు, కూరలు మాడిపోతాయే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని.. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ చెడు వాసన వస్తుందో  అటువంటి  ఇంట్లో కూడా లక్ష్మీదేవి అక్క అయిన జేష్టాదేవి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇవే కాకుండా శుచిశుభ్రత లేని ఇల్లు, పిల్లలు చెప్పిన మాట వినని ఇంట్లో  దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని తాంత్రికవేత్తలు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రులకు సేవ చేసిన చోట, పెద్దలను, గురవులను గౌరవించే చోట నుంచి  దరిద్రదేవత తనంతట తానుగా వెళ్లిపోతుందట.


ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి


   ఇక దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఏ పని చేసిన కలిసిరాదట, ఇక ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా తమ జీవితంలో ఎప్పటికీ  పైకి రారట. ఇక ఇంట్లోంచి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే నెలకి ఒకసారి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచిన్నారు. అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో ఉందంటున్నారు పండితులు. గుగ్గిలం పొడి, సాంబ్రాణి పొడి, ఆవునెయ్యి, ఎండు కొబ్బరి పొడి, పంచదార ఈ ఐదు వస్తువులు కలిపి ఇళ్లంతా ప్రత్యేకమైన ధూపం వేయాలని సూచిస్తున్నారు. ఇలా నెలకు ఒకసారి శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ  చేయడం వల్ల ఆ ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా.. వెంటనే బయటకు వెళ్లిపోతుందని ఆ ఇంట్లో  ఉండే వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని.. అలాగే వాళ్ల జీవితంలో కూడా ఆర్థిక పరమైన విషయంలో  ఎంతో పురోభివృద్ది మొదలవుతుందని చెప్తున్నారు.  


ALSO READ: ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: అకి వాళ్ల ఇంట్లో ఆర్య, అనుల ఫోటోలు చూసిన గౌరి, శంకర్


   అసలు  ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే దరిద్ర దేవతకు ఇష్టమైన పులుపు, కారం ఉండే నిమ్మకాయ, మిరపకాయను తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఉండిపోతుందని  పండితులు చెప్తున్నారు.


   ఇక ఆయుర్వేదంలోనూ ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు. రోజూ ఇంట్లో ధూపం వేస్తే.. శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందట. అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి దూపం మెడిసిన్‌ లా పనిచేస్తుందట.  సాంబ్రాణిని ఆయుర్వేదం లో కీళ్ళనొప్పుల నివారణకు జీర్ణక్రియకు, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారట. దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందట.


  అయితే ఇప్పుడు మార్కెట్‌ లో దొరికే సాంబ్రాణి నకిలీది అని నాణ్యత లేని సాంబ్రాని కొని ధూపం వేసుకోవడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నకిలీ సాంబ్రాణి ధూపం వల్ల మనుషులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్‌: సుధాకర్ బర్తుడే చేసిన కేదార్ – కేదార్ ను చంపేస్తానన్న యువరాజ్