Prema Entha Madhuram Serial Today Episode: అకి వాళ్ల ఇంటికి వచ్చిన గౌరి, శంకర్‌లు ఇంట్లో ఉన్న ఆర్య, అనుల ఫోటో చూసి షాక్ అవుతారు. మా ఫోటోస్ ఇక్కడెందుకున్నాయని అడుగుతారు. దీంతో జెండే, అకి ఏదో చెప్పి మేనేజ్ చేస్తారు. తర్వాత శంకర్, గౌరిని తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పైనుంచి వచ్చిన అభయ్ ఏమైందని అడుగుతాడు. నీకోసం గౌరి, శంకర్ వెయిట్ చేసి ఇప్పుడే వెళ్లిపోయారు అని చెప్పగానే సరేలే భోం చేద్దామని అభయ్ అంటాడు. అందరూ కలిసి భోం చేయడానికి వెళ్తారు. మరోవైపు ఇంటికి వచ్చిన గౌరి, శంకర్ డ్రైవింగ్ ను తిడుతుంది.
శ్రావణి: అబ్బా ఏంటక్కా మీరు. వెళ్లేటప్పుడు ఫ్రెండ్లీగానే వెళ్లారు. ఇప్పుడేంటి గొడవ పడుతూ వస్తున్నారు.
పెద్దొడు: మీరెప్పుడు గొడవ పడతారో.. ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారో ఎవ్వరికీ తెలియదు అన్నయ్య.
యాదగిరి: నిజమైన స్నేహితులంటే ఇలాగే ఉంటారు. ఇంతకీ ఎక్కడికి వెళ్లి వస్తున్నారు.
గౌరి: వినాయక చవితికి అకిని, జెండే సార్ ను ఇన్వైట్ చేద్దామని వాళ్ల ఇంటికి వెళ్లొచ్చాము అంకుల్.
యాదగిరి: అవునా.. అభయ్ బాబును కూడా పిలిచారా?
శంకర్: పిలిచాం. కాకపోతే తను మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడట. మమ్మల్ని కలవటం కుదరదు. పండగకి వస్తాం అని చెప్పమన్నాడట.
గౌరి: ఏంటో అకి, జెండే సార్ లాగా అభయ్ ఎవరితో కలవడేమో..?
యాదగిరి: అలాంటిదేం లేదు మేడం. అభయ్ కూడా చాలా మంచివాడు. అందరితో చాలా త్వరగా కలిసిపోతాడు.
శంకర్: నాకేంటో అలా అనిపించలేదు బాబాయ్. సరే అది పక్కన పెడితే వాళ్లేంటే విచిత్రంగా మా ఇద్దరి ఫోటోలు తీసుకెళ్లి వాళ్లింట్లో పెట్టుకున్నారు.
చిన్నొడు: వాళ్లింట్లో మీ ఫోటోస్ ఉండటమేంటి అన్నయ్య.
శంకర్: అదే కదరా నాకు షాకు.. కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలిరా? ఆ ఫోటో చూసి నాకు నేను మరిసిపోయాను.
అని శంకర్ చెప్తుంటే అయినా వాళ్లు మీ ఫోటోస్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్లు అని శ్రావణి అడగ్గానే శంకర్ కాంటెస్ట్ అని చెప్పబోతుంటే గౌరి, శంకర్ ను ఆపుతుంది. వెంటనే అందరూ పండుగ పనులు ఉన్నాయని వెళ్లిపోతారు. మరోవైపు భోజనం చేస్తున్న అభయ్ వాళ్ల అమ్మ అను తినిపించిన జ్ఞాపకం గుర్తు చేసుకుంటాడు. వంట బాగుందని అతిథులు అకిని మెచ్చుకుంటారు.
అకి: ఇది నేను వండలేదు.
అభయ్: అకి ఇది నువ్వు చేయలేదా?
రాకేష్: సర్వెంట్స్ ఎవరైనా చేసి ఉంటారులే అభయ్.
జెండే: కాదు.
అభయ్: మరి ఎవరు చేశారు. అచ్చం అమ్మ చేతి వంటలాగే ఉంది. టేస్ట్ చూడగానే నాకు అమ్మ గుర్తుకు వచ్చింది.
జెండే: ఇందాకా గౌరి, శంకర్ వాళ్లు వచ్చారు కదా? ఆ గౌరినే చేసింది.
అభయ్: ఆవిడ చేసిందా?
అకి: అవును అన్నయ్యా..
జెండే: ఇంత మందికి వంట చేయడం అకి వల్ల అవుతుందో లేదోనని నేనే గౌరి గారిని హెల్ఫ్ చేయమని అడిగాను.
అకి: తను వంట చేస్తుంటే నేనే షాక్ అయ్యాను అన్నయ్య. సేమ్ అమ్మ చేసినట్లే చేసింది.
అని అకి చెప్పగానే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది. ఆవిడకు ఒకసారి థాంక్స్ చెప్పాలి. అనగానే నువ్వు వాళ్లకు థాంక్స్ చెప్పాలి అనుకుంటే రేపు వినాయక చవితికి వాళ్ల ఇంటికి రావాలి అని చెప్తుంది. అభయ్ సరే అంటాడు. మరోవైపు సంధ్య, శ్రావణి పూజకు ఏర్పాట్లు చేస్తుంటే.. పెద్దొడు, చిన్నొడు వెళ్లి హెల్ప్ చేస్తుంటారు. శంకర్ పత్రి తీసుకుని వస్తాడు. ఇద్దరు తమ్ముళ్లను చూసి ఇక్కడేం చేస్తున్నారని అడగ్గానే గౌరి గారికి హెల్ప్ చేద్దామని వచ్చాం అంటారు. తర్వాత అందరూ కలిసి వినాయక చవితికి ఏర్పాట్లు చేస్తుంటారు. పనులు చేస్తూనే శంకర్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్తుండటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజు హగ్ చేసుకోవడంతో ఎమోషన్ అయిన మను – అంజు అమ్మానాన్నలు