Nindu Noorella Saavasam Serial Today Episode: అనాథ ఆశ్రమంలో బయట కూర్చున్న మనోహరి దగ్గరకు వెళ్లిన అంజలిని పట్టుకున్న మనోహరి ఎమోషనల్ ఫీలవుతుంది. అంజలి హగ్ చేసుకోవడంతో మనోహరి ఏడుస్తుంది. ఈ అంజలిని పట్టుకోగానే నా కూతురు దుర్గ కూడా అంజలి లాగే ఉండి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. మీరు ఇక్కడ బాధగా కూర్చున్నారు. మీరు అనాథ కాదు ఆంటీ మీకు మేమంతా ఉన్నాము.. అని అంజలి చెప్తుంది. దూరం నుంచి గమనిస్తున్న గుప్త నిన్ను అనాథను చేసిన నీ కన్నతల్లికి నువ్వు అనాథ కావు అంటూ భరోసా ఇస్తున్నావా బాలిక అనుకుంటాడు. అంజలి, మనోహరిని లోపలికి తీసుకెళ్తుంది.
ఆరు: అయినా అంజుకు మనోహరి అంటే అసలు పడదు కదా ఎందుకు లోపలికి తీసుకెళ్తుంది.
గుప్త: సృస్టిలో జరిగే ప్రతి చర్యకు కారణం ఉంటుంది. దీనికి ఓ కారణం ఉంది. కానీ అది ఎవ్వరికీ కనిపించడం లేదు
అని చెప్పగానే ఆరు చూస్తుండిపోతుంది. మరోవైపు రణవీర్ ఏడుస్తూ తన కూతురిని చూడక ఆరు సంవత్సరాలు అయిందని బాధపడుతుంటాడు. తర్వాత భాగీ బెడ్‌రూంలో ఉన్న పాత ఫైళ్స్ అన్నీ సర్దుతుంటే అందులోంచి ఒక పేపర్ గాలికి కొట్టుకుపోయి కింద అంజు దగ్గర పడుతుంది. అంజును అమర్, మిస్సమ్మ అడాప్ట్ చేసుకున్న పేపర్. అది చూడగానే అమర్ మొత్తం గుర్తు చేసుకుంటాడు. పైనుంచి గమనిస్తున్న భాగీ షాక్ అవుతుంది. తర్వాత అంజుకు ఏదో చెప్పి పంపిస్తాడు అమర్. కోపంగా భాగీ దగ్గరకు వెళ్తాడు అమర్.
అమర్: నా వస్తువులు ఇంకొకరు ముట్టుకుంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా మిస్సమ్మ. అయినా ఎందుకు మళ్ళీ ముట్టుకుని నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు.
భాగీ: అయినా నేను ఇవన్నీ...
అమర్: కారణం ఏదైనా సరే ఇవన్నీ నా జ్ఞాపకాలు.. నా గతం.. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ముట్టుకోకు.
అని పేపర్ ఫైల్స్ లో పెట్టి అమర్ వెళ్లిపోతాడు. అమర్ ఏదో దాస్తున్నాడని భాగీ అనుకుంటుంది. మరోవైపు గుప్త కంగారుపడుతుంటాడు. అనాథలుగా మొదలైన ఇద్దరి ప్రయాణం ఇటువంటి మలుసు తిరుగునని ఎన్నడూ ఊహించలేదు. తన జీవితాన్నే తన కూతురుకు ఇవ్వాలనుకుంటుంది మనోహరి. తన గత జీవితాన్ని ఎవ్వరికీ రాకూడదని కొత్త జీవితం ఇస్తున్న అరుంధతి ఒకవైపు. జగన్నాథ ఏమిటయ్యా నీ లీలలు అంటూ గుప్త ఆలోచిస్తుంటాడు. ఇన్ని చిక్కు ముడులను విప్పే వారు ఎవరు స్వామి అని ప్రార్థిస్తుంటాడు. ఇంతలో ఆరు వస్తుంది.
ఆరు: గుప్త గారు ఏమైంది మీలో మీరే మాట్లాడుకుంటున్నారు.
గుప్త: ప్రపంచంలోని వింతలన్నీ ఇచటనే జరుగుతుంటే ఇదంతా కలయా నిజమా అని ఆలోచిస్తున్నాను బాలిక.
ఆరు: మా ఇంట్లో వింతలా? ఏమున్నాయి గుప్త గారు.
గుప్త: నీకు కన్నవారు ఎవరో తెలియదు. ఆ బాలికకు తన సోదరి ఎవరో తెలియదు. నీ బిడ్డగా పిలవబడుతున్న ఆ అంజలికి తన కన్నవారు ఎవరో తెలియదు. తనను కన్నవారికి ఈ పిల్ల పిచ్చుకే తమ బిడ్డ అని తెలియదు.
అరు: అంజు కన్నవాళ్లకు అంజూయే తమ కూతురని తెలియదన్నారు. అది సరే తన కన్నవాళ్లకు అంజు తెలుసా పోని. చెప్పండి గుప్త గారు తెలుసా లేదా? అంటే వాళ్లు మాకు దగ్గరలోనే ఉన్నారా?
గుప్త: అయ్యో పిచ్చి బాలిక నీ ప్రాణాలు తీసిన నీ ప్రాణ స్నేహితురాలే.. నీవు ప్రాణాలు పోసిన అంజలి కన్నతల్లి అని నీకు ఎటుల చెప్పెద. అది తెలిసినచో నువ్వు తట్టుకోగలవా?
అని గుప్త మనసులో అనుకుంటుంటే ఆరు కోపంగా నా ప్రతి ప్రశ్నకు మీ మౌనం సమాధానం కాదు నిజం చెప్పండి. అని నిలదీస్తుంది. అయితే ఆనందం ఇవ్వని నిజం తెలుసుకుని ఏం లాభం అని గుప్త చెప్తాడు. త్వరలోనే అంజుకు నిజం తెలుస్తుందని చెప్తాడు. మరోవైపు భాగీ ఆలోచిస్తూ వెళ్లిపోతుంది రాథోడ్ వచ్చి పలకరించినా పలకదు. దీంతో రాథోడ్ తట్టి ఏమైందని అడుగుతాడు. దీంతో అడాప్ట్ సర్టిఫికెట్ గురించి భాగీ చెప్పగానే రాథోడ్ టెన్షన్ పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి