Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్ను మిత్ర కొడుకు కాదని అర్జున్, మిత్రల కొడుకు అని నిరూపిద్దామని దేవయాని మనీషాతో చెప్తుంది. దాంతో మనీషా లక్ష్మీ నిప్పు అని జున్ను మిత్ర కొడుకే కదా ఆ రోజు లక్ష్మీకి కవల పిల్లలు పుట్టారని అంటుంది. దేవయాని మనీషాతో లక్ష్మీ నిప్పు అని ఏ తప్పు చేయదు అని నాకు తెలుసు కానీ జున్ను అర్జున్ కొడుకు అని నిరూపిస్తే కోపంతో ఉన్న మిత్ర వెంటనే లక్ష్మీకి విడాకులు ఇచ్చేస్తాడని అంటుంది దేవయాని. మనీషా కూడా అలాగే చేద్దామని అంటుంది. లక్ష్మీ ఇక ఇంటికి రాదు అని అనుకుంటారు. కానీ లక్ష్మీ, జున్నులను తీసుకొని అరవింద వాళ్లు వస్తారు. ఇక అర్జున్ తాను ఇంటికి  వస్తే మిత్ర ఫీలవుతాడు అని రాను అని అంటాడు.


అర్జున్: లక్ష్మీ నీతో చెప్పకుండా పోలీసుల్ని తీసుకొచ్చినందుకు సారీ. మీ అందరికీ సారీ.
జయదేవ్: మేం తప్పుగా అనుకోలేదు అర్జున్ మా లక్ష్మీకి ఓ మంచి మిత్రుడిగా అండగా నిలిచినందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. 
అరవింద: లక్ష్మీని జున్నుని మీ సొంత మనుషుల్లా చూసుకున్నారు.
లక్ష్మీ: అవును అర్జున్ గారు మీరు ఆంటీ నన్ను సొంత మనుషుల్లా చూసుకున్నారు.
అర్జున్: ఇట్స్ ఓకే లక్ష్మీ. జున్ను వస్తాను.
అరవింద: రా లక్ష్మీ.
మనీషా: ఆగండి. నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీళ్లేదు. 
లక్ష్మీ: ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు.
మనీషా: నేను మిత్రకు కాబోయే భార్యని
లక్ష్మీ: నేను ఆల్రెడీ భార్యని ఈ ఇంటి కోడలిని.
దేవయాని: అది ఒకప్పుడు ఇప్పుడు కాదు
అరవింద: అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లక్ష్మీ ఈ ఇంటి కోడలు జున్ను ఈ ఇంటి వారసుడు.
మనీషా: వీళ్లు నాకు ఏం కారు నాకు వద్దు అని మిత్ర చెప్పాడు కదా మళ్లీ వీళ్లు ఏ అధికారంతో వచ్చారు. 
జాను: ఎవరు తప్పు చేశారో ఎవరు బావ మనసు మార్చేశారో ఇక్కడ అందరికీ తెలుసు గురివింద గింజలా మాట్లాడకు. 
మనీషా: ఎంత మాట అన్నావ్. అని కొట్టడానికి వెళ్తే లక్ష్మీ అడ్డుకొని నా చెల్లి మీద చేయి ఎత్తుతావా దించు అని మనీషాని తోసేస్తుంది. 
 లక్ష్మీ: మాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంది కాదు అని చెప్పే హక్కు నీకు లేదు. నువ్వు చెప్తే నేను అస్సలు వినను.
మిత్ర: నేను చెప్తే వింటావా. నువ్వు నీ కొడుకు నా ఇంట్లోకి రావడానికి వీళ్లేదు.
జున్ను: మేం ఎందుకు వెళ్తాం ఇది మా ఇళ్లు మేం ఇక్కడే ఉంటాం. మీరు ఎందుకు ఒప్పుకోరు ఇది మీ  ఇళ్లు మాత్రమే కాదు మా ఇళ్లు కూడా. మా అమ్మకు నాకు ఈ ఇంట్లో స్థానం ఉంది. 
మనీషా: వేలెడు అంత లేవు ఎంతలా మాట్లాడుతున్నావ్ రా మీ అమ్మ నిన్ను ఇలాగే పెంచిందా.
దేవయాని: అయినా వీళ్లతో మాటలు ఎందుకు మిత్ర మెడ పట్టుకొని గెంటేయ్
అరవింద: ఏం మాట్లాడుతున్నావ్ దేవయాని ఎవరిని మెడ పట్టుకొని గెంటేయ్ మంటున్నావ్. ఇది జయదేవ్ నందన్ కొడుకుగా మిత్ర ఇళ్లు. మిత్ర కొడుకుగా ఇది జున్ను ఇళ్లు.
జయదేవ్: మిత్ర నా వారసుడు అయితే వీడు మిత్ర వారసుడు.


లక్ష్మీ వాళ్లు ఇంట్లో ఉంటే తాను ఉండను అని మిత్ర చెప్తాడు. జయదేవ్, అరవింద ఒప్పుకోకపోవడంతో మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పి మిత్ర వెళ్లిపోతాడు. ఇక జున్నుని నానమ్మతాతయ్య వారసుడు అంటే నీలా ఉండాలి అని పొగుడుతారు. లక్ష్మీ వెళ్తుంటే మనీషా ఆపుతుంది. తనని కాదు అని ఇంటికి వచ్చినందుకు ఈ క్షణం నుంచి నీకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతాయని మనీషా అంటుంది. లక్ష్మీ కూడా మనీషాతో నిన్ను ఈ ఇంటి నుంచి గెంటే వరకు నీకు చుక్కలు చూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. 


మిత్ర దగ్గరకు లక్కీ వచ్చి ఏడుస్తుంది. నేను అనాథనా అని అడుగుతుంది. నాకు అమ్మానాన్న లేరా నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకున్నారా అని అడుగుతుంది. లక్కీ మాటలకు మిత్ర ఏడుస్తాడు. అలా ఏం కాదు అని అంటాడు. జున్నుకి అమ్మనాన్నగా మీరు, లక్ష్మీ అమ్మ ఉంది నాకు ఎవరూ లేరా నన్ను ఇంట్లో నుంచి పంపేస్తారా అనాథాశ్రమానికి పంపిస్తారా అని అడుగుతుంది. దాంతో మిత్ర ఏడుస్తూ నువ్వు లేకుండా నేను ఉండలేను నిన్ను ఎక్కడికి పంపనని అంటాడు. జున్ను లక్ష్మీ అమ్మ మనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని నాకు తను అమ్మే కదా వాళ్లు మనతోనే ఉండాలి అని అంటుంది. జున్ను అమ్మ అంటే తనకు ఇష్టమే అని చెప్తుంది. 


మనీషా ఆకలిగా ఉన్న పులిలా దాడి చేస్తుంది నువ్వు తట్టుకొని నిల్చొవాలి అని లక్ష్మీకి అందరూ చెప్తారు. మరోవైపు మనీషా కూడా లక్ష్మీని ఎదుర్కొడానికి తన ప్లాన్లు వేస్తుంది. మనీషాతో యుద్ధం చేయాలని పాత లక్ష్మీగా ఉంటే సరిపోదని చెప్తారు. ఇక దేవయాని, మనీషాలు కుట్రలు చేసి లక్ష్మీని తరిమేయాలి అనుకుంటారు. మిత్రకు లక్ష్మీ మీద తప్పుడు మనిషిగా చేయాలి అని అనుకుంటారు. ఇక లక్ష్మీ కూడా మిత్ర దగ్గర మనీషా చేసిన తప్పులు చేస్తానని అంటుంది. మనీషాకు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించి అలాంటి ప్రేమ ఇంకెక్కడైనా వెతుక్కోవాలని చెప్పి ఇంటి నుంచి పంపేస్తానని లక్ష్మీ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: 'త్రినయని' సీరియల్: పంచకమణి దొంగతనం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న తిలోత్తమ.. సుమన కుట్ర తెలుసుకున్న ఫ్యామిలీ!