Trinayani Serial Today Episode పంచకమణి దక్కించుకున్న గజగండ ఇంకా బలవంతుడిగా మారిపోతాడని గురువుగారు చెప్తారు. గాయత్రీపాప, విశాల్ జాగ్రత్తగా ఉండాలి అని మీ ఇద్దరినే గజగండ లక్ష్యంగా పెట్టుకొని ఉంటాడని గురువుగారి చెప్తారు. మరోవైపు విక్రాంత్ ఆరు బయట కూర్చొని ఫైల్స్ చూస్తుంటే సుమన కోపంతో అక్కడికి వచ్చి కూర్చొంటుంది. దురంధర తనని కొట్టడం గుర్తు చేసుకొని తిట్టుకుంటుంది. విక్రాంత్ కూడా సుమనకు సెటైర్లు వేస్తాడు. ఏ పేస్ట్ వాడుతావ్ సుమన ఎంత మంది కొట్టిన నీ పళ్లు ఊడటం లేదని సెటైర్లు వేస్తాడు. తన అక్క పంచకమణి తీసుకొని వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేదని అంటుంది. సొంత అక్క అయిన నయనిని ఓదార్చలేదని విక్రాంత్ సుమనను తిడతాడు. మరోవైపు తిలోత్తమ, వల్లభ మాట్లాడుకుంటారు.


తిలోత్తమ: ఈ అమ్మ అన్నమాట నిలబెట్టుకోలేకపోయింది అన్న బాధ కొంచెమైనా ఉందారా నీకు. 
వల్లభ: అర్థం కాలే.
తిలోత్తమ: పంచక మణి గురించి తెలిశాక మనం దాన్ని కావాలి అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు అది గజగండ కొట్టేశాడు. అది మనకి కదా దక్కాల్సింది కదా. గజగండ దగ్గర ఉన్న పంచకమణిని మనం ఇప్పుడు కొట్టేయాలి. 
వల్లభ: వాడు ఇప్పుడు చాలా బలవంతుడు కదా మనం ఎలా కొట్టేయగలం.
తిలోత్తమ: తెలివికి మించిన శక్తి ఏ ఆయుధానికి ఉండదు వల్లభ. నమ్మించి మోసం చేస్తే ఏదైనా సరే వశం అవుతుంది. నయని కష్టాన్ని గజగండ దోచుకున్నాడు. ఇప్పుడు మాయావేశం వేయగలిగిన గజగండను ఎలా దెబ్బకొట్టాలో ఆలోచించాలి. పంచకమణి గురించి పూర్తిగా తెలిసిన గాయత్రీ దేవి నయనికి ఏం చెప్తుందో అది తెలుసుకోవాలి. 
వల్లభ: మరి గజగండకి తెలీదా.
తిలోత్తమ: అక్కడే ఉందిరా అసలు ట్విస్ట్. 


విశాల్  డల్‌గా కూర్చొని ఉంటే దురంధర, హాసిని అక్కడికి వస్తారు. నయని కూడా వస్తుంది. నయని కూడా పంచకమణి పోయిందని డల్‌ అయిపోతుంది. నయని, విశాల్  బాధగా ఉంటే వాళ్లని ఓదార్చడానికి దురంధర, హాసిని పనులు, భోజనాలు అంటూ ఏవేవో మాట్లాడుతారు. 


దురంధర: నువ్వు మంచోడివి కాబట్టి సరిపోయింది అదే వేరే ఎవరైనా గెట్ అవుట్ అనేవాళ్లు. 
నయని: బాబు గారు ఎప్పుడూ అలా అనరు ముఖ్యంగా ఆడవాళ్ల మీద అరవరు.
దురంధర: ఏది ఏమైనా ఆ గజగండ గురువుగారిలా ఇంటికి వచ్చి చేసిన మోసాన్ని మర్చిపోలేం. 
హాసిని: పూజారిలా వచ్చి విశాల్ చేయి పూర్తిగా కదలకుండా చేసింది కూడా వాడే అనుకుంటా. 
నయని: అవును అక్క. అతన్ని ఇంతకు ముందు మనం చూడలేదు కాబట్టి కుట్ర అని తెలుసుకోలేకపోయాం.
విశాల్: అమ్మ వాళ్లకి తెలిసినా బాగుండేది.
హాసిని: వాళ్లకి తెలిసినా కూడా అలాగే చేసుండేవారు. 
నయని: బాబుగారు మీరు నన్ను క్షమించాలి పంచకమణిని తీసుకురాలేకపోయాను.
విశాల్: నువ్వు సారీ చెప్పకూడదు నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే తిరిగి వచ్చి నన్ను బతికించావ్.


గజగండ పంచకమణిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేస్తుంటాడు. ఇంతలో తిలోత్తమ అక్కడికి వస్తుంది. పంచకమణి ఎక్కడుందని తిలోత్తమ గజగండని అడిగితే పెట్టెలో ఉందని తన ఎదురుగా ఉన్న పెట్టెను చూపిస్తాడు. తిలోత్తమ మనసులో ఈ పెట్టెలో పంచకమణి ఉందని ముందే తెలిసి ఉంటే గజగండ ధ్యానం చేసినప్పుడు పెట్టె పట్టుకొని వెళ్లిపోయేదాన్ని అనుకుంటుంది. ఇక పంచకమణి చూపించమని గజగండని అడుగుతుంది. గజగండ పెట్టె తిలోత్తమ చేతిలో పెట్టగానే తన చేత్తో పట్టుకొని పంచకమణి చూస్తుంది. ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయైపోతుంది.  


ఇక పంచక మణి ప్రభావం ఇప్పుడే ఉంటుందా అని తిలోత్తమ అడిగితే నేను నయని దగ్గర తీసుకున్నా కాబట్టి పక్షం రోజులు ఆగితే అమావాస్య రోజు దాని ప్రభావం మొదలవుతుందని అంటాడు గజగండ. ఇక తిలోత్తమ పంచకమణిని తన చేతిలో దాచుకొని పెట్టే మూసేసి అందులో గజగండకి ఇచ్చేస్తుంది. ఇక తిలోత్తమ వెళ్లిపోతుంటే గజగండ ఆపి పంచకమణి దొంగిలించిన నువ్వు ఆరు ఆడుగులు వేస్తే చనిపోతావని చెప్తాడు. దాంతో తిలోత్తమ షాక్ అవుతుంది. పంచకమణిని పెట్టెలో పెట్టకపోతే నెత్తురు కక్కుకొని పోతావని అంటాడు. దాంతో తిలోత్తమ నువ్వు కనిపెడతావో లేదో అని ఇలా చేశానని అంటుంది.  


మరోవైపు పెద్దబొట్టమ్మ ఇంటికి వచ్చి మన పాపని ఒకసారి ఎత్తుకుంటా అని సుమనతో అంటుంది. మన పాప ఏంటి అని సుమన పెద్దబొట్టమ్మని అడుగుతుంది. ఇళ్లు మారిని ఎలా తెలుసుకొని వచ్చావ్ అని సుమన అడుగుతుంది. పాపని ఎత్తుకుంటా అంటే సుమన ముట్టుకోవద్దని అంటుంది. తనని శ్రీమంతురాల్ని చేస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోలేదని అంటుంది. సుమన మాటలు నయని వాళ్లు విని షాక్ అయిపోతారు. ఇక పెద్దబొట్టమ్మ సుమనతో నయని పంచకమణి తీసుకొస్తే అవుతావు అని చెప్పాను కదా అని అంటుంది. దానికి సుమన మా అక్క ఇంటి వరకు తీసుకురాలేకపోయిందని దానికి నేనేం చేయాలి అని, నీ మాట విని విశాల్ బావని గుడి వరకు తీసుకొచ్చి తేలు కుట్టే వరకు చేయగలిగానని అంటుంది. ఆ మాటలకు నయని వాళ్లు షాక్ అయిపోతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకాన్ని అవమానించిన అంబిక, నానమ్మలకు వార్నింగ్ ఇచ్చిన విహారి.. చనిపోయిన అమ్మాయి కనకమేనా?