పురాతన కాలం నుంచి గొప్ప ఔషధ మూలికగా ఉపయోగపడుతుంది లెమన్ గ్రాస్. నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది సహజ నివారిణిగా పని చేస్తుంది. ఇది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటుంది. పోషకాలు అందించినప్పటికి ఒకేసారి ఎక్కువ తినడానికి అవకాశం లేదు. తక్కువ మొత్తంలో తీసుకునే అనేక ముఖ్యమైన పోషకాలు అందిస్తుంది.
అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు నిమ్మగడ్డితో చేసిన టీ తాగితే మంచిది. ఇది రక్తపోటుని నియంత్రిస్తుంది. జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కుదుళ్లు గట్టిపడి జుట్టు బాగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. దీనితో టీ తయారు చేసుకుని తాగొచ్చు. ఒకరకంగా ఇది కూడా ఔషధాల టీ జాబితాలోకే వస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ అతిగా తీసుకోవడం వల్ల అనార్థాలు కూడా ఉన్నాయి.
లెమన్ గ్రాస్ ప్రయోజనాలు
వ్యర్థాలు తొలగిస్తుంది
లెమన్ గ్రాస్ శరీరంలోని హానికరమైన విష వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. డిటాక్సిఫికేషన్ శరీరంలోని మూత్రపిండాలు, కాలేయంతో సహా వివిధ అవయవాల నియంత్రణను మెరుగుపరుస్తుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తికి...
జీర్ణక్రియ, విసర్జన, శ్వాస క్రియ వంటి ముఖ్యమైన విధులని పునరుద్ధరించడంలో ఇది సహాయపడుతుంది. పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది.
చర్మానికి మేలు
లెమన్ గ్రాస్ జిడ్డు లేదా మొటిమల బారిన పడే చర్మానికి స్కిన్ టానిక్, క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని టోన్ చేయడంలో బాగా సహాయపడుతుంది.
పొట్టకి ఆరోగ్యకరమైనది
జీవక్రియని మెరుగుపరిచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తి వంటి రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. మహిలలి నిమ్మగడ్డితో టీ చేసుకుని తరచూ తాగడం వల్ల నెలసరిలో వచ్చే నొప్పులు తగ్గిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే గుణాలు ఇందులో ఉన్నాయి.
నిద్రలేమి దూరం చేస్తుంది
లెమన్ గ్రాస్ టీలో హిప్నోటిక్, మత్తు మందు లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది నిద్ర నాణ్యతని మెరుగుపరుస్తుంది.
లెమన్ గ్రాస్ వల్ల అనర్థాలు
లెమన్ గ్రాస్ వంట చెయ్యడానికి సురక్షితంగా ఉంటుంది. అయితే దీన్ని అధికంగా వినియోగించడం వల్ల అనేక దుష్ప్రభావాలకి దారితీస్తుంది.
☀ నోరు పొడి బారిపోవడం
☀అలసట
☀తలతిరగడం
☀తరచూ మూత్ర విసర్జన
☀ఆకలిగా అనిపించడం
☀దద్దుర్లు, దురద వంటి అలర్జీలు
లెమన్ గ్రాస్ లేదా ఇతర మూలికలని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు దాని వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి ముందుగానే వైద్యులని సంప్రదించాలి. వాళ్ళు సూచించిన తర్వాత మాత్రమే దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: ఈ ఐదు మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యమే కాదు బరువు తగ్గుతారు