కిచెన్ గ్యాడ్జెట్స్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరికరం ఎయిర్ ఫ్రైయర్. చూసేందుకు చిన్నగా ముచ్చటగా కనిపించే దీని మీద అందరూ మనసు పారేసుకుంటున్నారు. క్రిస్పీ ఆహార పదార్థాలు తినాలని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా దీని వైపే మొగ్గు చూపుతున్నారు. చూసేందుకు చిన్న కుక్కర్ మాదిరిగా కనిపిస్తుంది. ఇందులోని పదార్థాలు తింటే నూనె తక్కువగా ఉంటుంది అలాగే రుచికి రుచి పైగా మీకు నచ్చినట్టుగా క్రిస్పీగాను ఉంటాయి. అయితే ఇందులో ఆహార పదార్థాలను పెట్టె ముందు అందులోని బాక్స్ కి కొద్దిగా ఆయిల్ రాయాలి. అలా చేస్తేనే అందులోని ఆహార పదార్థాలు దానికి అతుక్కుపోకుండా ఉంటాయి.
వండుకోవడం వరకు బాగానే ఉంది మరి శుభ్రం చేయడం అంటే కాస్త కష్టమైన పని. అందుకే అందులో ఆహార పదార్థాలు పెట్టె ముందు వాటికి అల్యూమినియం ఫాయిల్ పేపర్ పెడితే ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఎయిర్ ఫ్రైయర్ లో అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంచడం సురక్షితమేనా అనే సందేహం చాలా మందికి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్యూమినియం ఫాయిల్ ని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టడం సురక్షితమే అని అంటున్నారు. ఇవి ఆహారం మీద చుట్టడం వల్ల పదార్థాలు చక్కగా ఊదుకుతాయి. పైగా ఎయిర్ ఫ్రైయర్లోని హైస్పీడ్ ఫ్యాన్ గాలులకు ఇది ఎటువంటి ఆటంకం కలిగించాడు.
రుచిని పెంచుతుంది
ఆహార పదార్థాలకు ఫాయిల్ పేపర్ చుట్టడం వల్ల అందులోని ఆయిల్, రసాలు ఫ్రైయర్ బాక్స్ లో పడకుండా అడ్డుకుంటుంది. అందువల్ల దాని రుచి కూడా చెక్కు చెదరకుండా అంతే ఉంటుంది.
ఆహారం విడిపోకుండా చేస్తుంది
ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టె ఆహారానికి అల్యూమినియం ఫాయిల్ చుట్టడం వల్ల పదార్థాలు బయటకి రాకుండా ఉంటాయి. అలా ఉంటే బాక్స్ లో నుంచి పదార్థాలు తీసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. లేదంటే పదార్థాలు ముక్కలు జారి చెల్లాచెదురుగా పడిపోతాయి. వాటన్నింటిని ఒక చోటకు చేర్చి తోసుకోవడం కంటే ఇది సులభమైన పద్ధతి.
శుభ్రం చేయడం సులభం
అన్నింటికంటే ప్రయోజనం ఏంటంటే ఉపయోగించిన తర్వాత దాన్ని శుభ్రం చేయడం చాలా సులభం. దాంట్లో పదార్థాలు చుట్టి పెట్టడం వల్ల ముక్కలు కాకుండా నివారిస్తుంది. ఇలా చేస్తే అప్పడప్పుడు ఫుల్ బాస్కెట్ క్లీనింగ్ చేసుకునే బాధ తప్పుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవచ్చు అన్నారు కదా అని ఎక్కువగా ఉపయోగించకూడదు. నిపుణులు అభిప్రాయం ప్రకారం వీలైనంత తక్కువ ఫాయిల్ పేపర్ తీసుకోవాలి. అప్పుడే ఆహారం కూడా సులభంగా ఊదుకుటుంది. అలాగే ఫ్రైయర్ డ్రా కింద ఎప్పుడు రేకులు పెట్టకూడదు. ఇది ఎయిర్ ఫ్రైయర్ ని దెబ్బతీస్తుంది. అల్యూమినియం ఫాయిల్ రియాక్టివ్ మెటల్. అందుకే అందులో టొమాటో, వెనిగర్, నిమ్మరసం వంటి అధిక ఆమ్ల ఆహారాలు ఎప్పుడు పెట్టకూడదు. ఒకవేళ మీకు అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించడం ఇష్టం లేకపోతే దానికి బదులుగా పార్చ్ మెంట్ కాగితాన్ని ఉపయోగించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పుట్టుమచ్చలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? జాగ్రత్త ప్రమాదరకమైన ఈ వ్యాధి సంకేతం కావొచ్చు