Union Budget 2023:
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరటనిచ్చారు. పాత ట్యాక్స్ సిస్టమ్‌కి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఏయే వస్తువుల ధరలు పెరుగనున్నాయి, తగ్గనున్నాయో కూడా వెల్లడించారు. ఆ లిస్ట్ ఓ సారి చూద్దాం.
ధరలు తగ్గేవి
. మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్
. విదేశాల నుంచి వచ్చే వెండి
. టీవీలు, బయోగ్యాస్
. టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
. విద్యుత్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు
ధరలు పెరిగేవి
. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16% వరకూ పెంపు
.టైర్లు, బ్రాండెడ్ దుస్తులు, కిచెన్ చిమ్నీలు
మరి కొన్ని కీలక అంశాలు
1.రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు. ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను. రూ.15 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్
2 .రూ. 7 లక్షల ఆదాయం దాటితే..రూ.3-6 లక్షల వరకూ 5% పన్ను. రూ.6-9 లక్షల వరకూ 7% ట్యాక్స్. రూ.9-12 లక్షల వరకూ 12% పన్ను
3. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పొదుపు మొత్తం పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ పెంచారు.
4. Monthly Income Account Scheme కింద ప్రస్తుతం ఉన్న రూ.4.5 లక్షల పరిమితిని రూ.9 లక్షలకు పెంచారు.
5.మహిళలకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇస్తారు. రెండేళ్ల వరకూ ఇందులో రూ.2 లక్షల మొత్తం పొదుపు చేసుకోవచ్చు.
6.ఇకపై కామన్ ఐడెంటిటీగా ప్యాన్ కార్డ్‌నే పరిగణిస్తారు. విద్యుత్ రంగంలో రూ.35 వేల కోట్లు కేటాయించనుంది కేంద్రం.
7. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 లో భాగంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లు ఏర్పాటు చేయనున్నారు.