Stock Market Opening 01 february 2023: 


స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. బడ్జెట్‌ రోజు కావడం, పన్ను విధానాల్లో మార్పులు, పరిశ్రమలకు ఉపయోగపడేలా పద్దును ప్రవేశపెడతారన్న అంచనాలతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 105 పాయింట్ల లాభంతో 17,767 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 380 పాయింట్ల లాభంతో 59,940 వద్ద కొనసాగుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లకు గిరాకీ పెరిగింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 59,549 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,001 వద్ద మొదలైంది. 59,807 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,066 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. 9:40 గంటలకు 380 పాయింట్ల లాభంతో 59,940 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 17,662 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,811 వద్ద ఓపెనైంది. 17,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,815 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 105 పాయింట్ల లాభంతో 17,767 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 41,115 వద్ద మొదలైంది. 40,953 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,177 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 430 పాయింట్లు పెరిగి 41,085 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంకు, బ్రిటానియా, దివిస్‌ ల్యాబ్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, బీపీసీఎల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, మెటల్‌, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు కళకళలాడుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.