కూల్ డ్రింక్ టిన్స్ తాగేందుకు భలే స్టైలిష్‌గా ఉంటుంది కదూ. సాధారణంగా బాటిల్ లో కూల్ డ్రింక్ కన్నా కూడా అల్యూమినియం క్యాన్లో కూల్ డ్రింక్ చాలా రుచికరంగా ఉంటుందని, మరింత ఎక్కువగా చల్లదనం ఉంటుందని, అందులో గ్యాస్ కూడా లీక్ అవ్వదని.. అందుకే దాని రుచి ప్రత్యేకంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే ఇలా తాగడం హానికరం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్స్ మీ శరీరానికి అనేక రకాల సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్‌లకు గురి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి ద్వారా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు సైతం సంభవించే అవకాశం ఉందట. అయితే క్యాన్లలో మీకు ఇష్టమైన పానీయం తాగేటప్పుడు ఇన్ఫెక్షన్లను నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలను తెలుసుకుందాం.
క్యాన్స్ తయారీ యూనిట్లో తయారు అవుతాయి. తరువాత వాటిని శీతల పానీయాల కంపెనీకి పంపుతారు. వాటిని ఆ కంపెనీ వారు స్టోరేజీ రూములో నిలువ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా పానీయాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ క్యాన్స్ లను వినియోగదారులకు అందించడానికి ముందు వాటిని శుభ్రం చేస్తారు. అయితే క్యాన్స్ నిల్వ చేసే సమయంలో వాటిని అపరిశుభ్ర వాతావరణంలో ఉంచే అవకాశం ఉంది.
ఒక్కోసారి క్యాన్స్ ను నిల్వచేసినప్పుడు వాటిపై ఎలుకలు పరిగెత్తవచ్చు. వాటిపై ఎలుక మలమూత్రాలు పడితే, అలాంటి క్యాన్స్ ను మీరు పొరపాటున తీసుకోవడం వల్ల లెప్టోస్పిరోసిస్ వ్యాధి వస్తుంది. లెప్టోస్పిరోసిస్ అనేది జంతువులతో పాటు మనుషులను ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి. లెప్టోస్పిరోసిస్ లక్షణాల విషయానికి వస్తే ఇందులో తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, అతిసారం వస్తాయి. మరోవైపు తీవ్రమైన సమస్యలు వచ్చినట్లయితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతింటాయి. తీవ్ర శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా క్యాన్ల నుండి ఎలా త్రాగాలి:
3 సులభమైన చిట్కాలు:
- క్యాన్స్ ఓపెన్ చేసిన తర్వాత నేరుగా తాగకుండా, పానీయాన్ని ఒక గ్లాసులో పోసి, తాగండి.
- క్యాన్స్‌ను కడిగి తాగే ముందు శుభ్రమైన గుడ్డతో తుడవండి.
- క్యాన్స్ మూత తెరిచి, స్ట్రా వేసి సిప్ చేయండి.
లేదా దాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత నీటితో శుభ్రం చేసి తాగండి. తద్వారా మీకు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అలాగే క్యాన్ ను ఎప్పుడు ఫ్రీజర్ లోనే భద్రపరచుకోండి. దానివల్ల దానిపై బ్యాక్టీరియా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతులు పాటిస్తే.. మీకు ఎలాంటి రోగాలు రావు. దరిచేరవు కూడా. మరి తప్పకుండా పాటిస్తారు కదూ.
Also Read : ఉప్పు లేదా చక్కెర - వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.