గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు తినే పదార్థాలు మీ గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ రోజుల్లో ప్రజలు ఉప్పు, తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి ఇలాంటి వాటి వల్లే గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆహారంలో ఉప్పు, పంచదార ఎక్కువగా వాడుతున్నాం. ఈ రెండు తెల్లని వస్తువులు ఆరోగ్యానికి నిజమైన శత్రువులుగా పరిగణించాలి. చాలా అధ్యయనాలు నిపుణులు ఉప్పు చక్కెరతో కూడిన ఆహారాలు గుండె జబ్బును కలిగిస్తాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. ఉప్పు, చక్కెర మీ గుండె ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తున్నాయో తెలుసుకుందాం.
చక్కెర మీ గుండెకు ఎందుకు చేటు?
జంక్ ఫుడ్, శీతల పానీయాలు, పండ్ల రసాలు, కుకీలు, క్యాండీలు, కేక్‌లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. హార్వర్డ్ హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం చక్కెర మీ గుండెను నేరుగా ప్రభావితం చేయకపోయినా, అనేక ప్రమాద కారకాలను పెంచడం ద్వారా ఇది గుండెపై ప్రభావం చూపుతుంది. ఇది కొవ్వును పెంచేందుకు దోహదపడుతుంది. ఈ కొవ్వు కాలేయం ద్వారా స్థూలకాయానికి దారితీస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
ఉప్పు గుండెకు ఎంత హానికరం?
అధిక సోడియం గుండెకు మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా హానికరం. రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవడం మంచిది. బ్రెడ్, పిజ్జా, శాండ్‌విచ్‌లు, మాంసం, సూప్‌లు, సాల్టీ స్నాక్స్, పౌల్ట్రీ, చీజ్ ఆమ్లెట్స్ వంటి ఆహారాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, సోడియం అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో నీటి పరిమాణాన్ని పెంచుతుంది, దీని వలన గుండె ఎక్కువ కష్టపడి పని చేస్తుంది, తద్వారా మీ రక్తపోటు పెరుగుతుంది. పెరిగిన బీపీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
షుగర్ మిమ్మల్ని లావుగా మార్చుతుంది, మధుమేహం వచ్చే ప్రమాదం పెంచుతుంది. అథెరోస్క్లెరోసిస్‌ను ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మరోవైపు, సోడియం రక్తపోటును పెంచుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఎక్కువ చక్కెర లేదా ఎక్కువ ఉప్పు తిన్నా, రెండూ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
అధ్యయనం ప్రకారం ఉప్పు కాని చక్కెర కానీ మోతాదు మించకుండా తీసుకున్నట్లయితే ప్రమాదం కాదని నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకు చక్కర ఒక రోజుకు 30 గ్రాములు మించకుండా తీసుకున్నట్లయితే ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో ఉప్పు సైతం ఒక టీ స్పూన్ మించకుండా తీసుకున్నట్లయితే, శరీరంలో రక్త పోటు వచ్చే అవకాశం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.
Read Also : మీకు మధుమేహం ఉందా? అయితే ఈ స్మూతీ రెసిపీ మీకోసమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.