Diabetes Diet : మధుమేహం ఉన్నవారికి ప్రత్యేకమైన డైట్ ఉంటుంది. వాటిని విస్మరిస్తే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. అంతేకాదు త్వరగా సిక్ అయిపోతారు. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడేవారు కష్టమైన.. కొన్ని కఠినమైన డైట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే దీనికోసం స్వీట్స్ పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. కొన్నిసార్లు నోటికి కనీసం రుచిలేని ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా స్మూతీలు కూడా తీసుకోరు. ఎందుకంటే ఇవి శరీరంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి కాబట్టి. అయితే మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్న స్మూతీ.. మీ షుగర్‌ను అదుపులో ఉంచడమే కాకుండా మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.
అవును మీరు వింటున్నది నిజమే. మీరు స్మూతీని మీ ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవచ్చు. అయితే దేనిని పడితే దానిని తీసుకోకూడదు. డయాబెటిస్ ఫ్రెండ్లీ స్మూతీలు కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇవి మీ నోటికి రుచిని అందిచడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు అందించి.. మెరుగైన ఆరోగ్యం అందిస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కష్టం అనుకుంటున్నారేమో.. కానీ ఈ రెసిపీని తయారు చేయడం చాలా తేలిక. దీనిని బొప్పాయి, అరటిపండుతో తయారు చేస్తారు. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో..? దానిని ఎలా తయారు చేయాలో.. దీని వల్ల కలిగే లాభాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బొప్పాయి ముక్కలు - 1 కప్పు
అరటిపండు - 1
పెరుగు - 1 కప్పు
చియా సీడ్స్ - 1 టీస్పూన్ (నానబెట్టుకోవాలి)
తయారీ విధానం..
ఈ స్మూతీ తయారు చేసుకోవడం చాలా తేలిక. బొప్పాయి, అరటిపండు, పెరుగు, చియాసీడ్స్‌ను స్మూతీ జార్లో వేసి.. బాగా మిక్స్ చేయాలి. దీనిని ఓ గ్లాస్‌లోకి తీసుకోవాలి. బొప్పాయి ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకోవాలి. మరింత శక్తికోసం నాన బెట్టిన బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌తో గార్నీష్ చేసుకోవచ్చు. అంతే టేస్టీ, హెల్తీ స్మూతీ రెడీ. బొప్పాయి, అరటిపండు రెండూ డైటరీ ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫోలెట్లు ఆరోగ్యానికి అవసరమైనవి. పెరుగు ప్రోటీన్, ప్రోబయోటిక్స్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడమే కాకుండా.. కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది.
కేవలం పండ్లతోనే కాదు.. మీరు మధుమేహం కలిగి ఉంటే.. కూరగాయలతో కూడా స్మూతీలు తయారు చేసుకోవచ్చు. పాలకూర, దోసకాయ, బీట్రూట్, క్యారెట్లు ఫైబర్, పోషకాలను నిండుగా కలిగి ఉంటాయి. వీటికి లో ఫ్యాట్ మిల్క్ జోడించి.. ప్రోటీన్‌ను పొందవచ్చు. ఇలాంటి రెసిపీలు కేవలం మధుమేహ వ్యాధిగ్రస్తులకే అంటే పొరపాటే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు, జిమ్‌కి వెళ్లే ప్రతి ఒక్కరూ దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మీ స్కీన్‌కు, జుట్టుకు కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది.
Also Read : బరువును వేగంగా తగ్గించి.. డయాబెటిస్‌ను కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.