ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) గోరఖ్‌పుర్‌.. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 142 గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1770 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1416 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు: 142



  • ట్యూటర్/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 15 పోస్టులు


  • స్టాఫ్ నర్స్ గ్రేడ్-I: 57 పోస్టులు


  • మెడికల్‌ సోషల్‌ వర్క్‌: 01  పోస్టులు


  • అసిస్టెంట్‌ ఎన్‌ఎస్‌: 01 పోస్టులు
     

  • లైబ్రేరియన్ గ్రేడ్-II: 01 పోస్టులు


  • టెక్నికల్ అసిస్టెంట్/ టెక్నిషియన్‌: 01 పోస్టు


  • స్టోర్ కీపర్: 02 పోస్టులు


  • హాస్టల్ వార్డెన్: 02 పోస్టులు 


  • పీఏ టు ప్రిన్సిపాల్: 01 పోస్టు


  • ల్యాబ్ టెక్నీషియన్: 08 పోస్టులు


  • స్టెనోగ్రాఫర్: 01 పోస్టు


  • క్యాషియర్: 02 పోస్టులు


  •  ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II: 08 పోస్టులు


  • లైబ్రరీ అటెండెంట్‌ గ్రేడ్-II: 01 పోస్టు


  • ఎల్‌డీసీ (లోయర్‌ డివిజన్ క్లర్క్): 01 పోస్టు


  • హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III (నర్సింగ్ ఆర్డర్లీ): 40 పోస్టులు


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: కొన్ని పోస్టులకు 18 - 35 సంవత్సరాల మధ్య, కొన్ని పోస్టులకు  21 - 30 సంవత్సరాల మధ్య, కొన్ని పోస్టులకు  25 - 35 సంవత్సరాల మధ్య, కొన్ని పోస్టులకు  30 - 45 సంవత్సరాల మధ్య, కొన్ని పోస్టులకు  18 - 27 సంవత్సరాల మధ్య,  కొన్ని పోస్టులకు  18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు. 


దరఖాస్తు ఫీజు: రూ.1770. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1416 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 21.11.2023.


Notification


Online Application


Website


SYLLABUS


ఎయిమ్స్ భోపాల్‌లో 357 ఖాళీలు..
భోపాల్‌లోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అటెండెంట్, క్యాషియర్ & పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 357 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.  సీబీటీ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..