కంటి నిండా నిద్ర, కడుపు నిండా రెండూ ఆరోగ్యానికి చాలా కీలకం. వీటిలో ఏది సరిగా లేకపోయినా వెంటనే శరీరంపై ప్రభావం చూపుతుంది. కొంచెం సేపు నిద్రపోయినా, ఎక్కువసేపు నిద్రపోయినా, వారాంతమే కదా అని ఫుల్ గా నిద్రపోయినా, సరిగా నిద్రపోకుండా ఎక్కువసేపు మేల్కొని ఉండటం వంటివి చేస్తున్నారా..? అయితే మీ ఆరోగ్యం ప్రదంలో పడినట్లే. క్రమం లేకుండా నిద్ర పోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుంది. అంతే కాదు గుండె జబ్బులు, కిడ్నీలు దెబ్బతినడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. సక్రమంగా నిద్రపోకపోవడం(స్లీప్ వేక సిండ్రోమ్) వల్ల కలిగే ఫలితాల మీద ప్రపంచవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా అధ్యయనాలు జరిగాయి. వేళకి నిద్రపోకపోవడం వల్ల అధిక బరువు పెరగడంతో పాటు మధుమేహం, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదంఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుల నివేదిక ప్రకారం సక్రమంగా నిద్రపోకపోవడానికి సిర్కాడియన్ సైక్లింగ్ ప్రాసెస్ సరిగా లేకపోవడమే. ఇది నిద్ర పోయే సమయాన్ని, మేల్కొనే సమయాన్ని నిర్ణయిస్తుందినియంత్రిస్తుంది. ఈ సైక్లింగ్ ప్రాసెస్ గాడి తప్పిందంటే శరీరంలో అంతర్గతంగా సమయానికి జరగాల్సిన పనులన్నీ అస్తవ్యస్తం అవుతాయి. క్రమరహితంగా నిద్రపోవడం వల్ల అల్జీమర్స్, డీమెన్షియతో పాటు అనేక వ్యాదులు వచ్చే అవకాశం ఉంది. మనిషి శరీరంలో శారీరక, మానసిక, ప్రవర్తన విధానాలు సిర్కాడియన్ సైక్లింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటాయి.
క్రమరహిత నిద్రకి కారణాలు
ఉద్యోగ పని వేళలు మారుతూ ఉండటం, ఎక్కువగా ప్రయాణాలు చెయ్యడం, అతిగా ఫోన్ చూడటం, గేమ్స్ ఆడుకుంటూ మేల్కొని ఉండటం, అతిగా లోచించడం, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల నిద్రపోకుండా ఉండటం జరుగుతుంది.
అధిగమించడం ఎలా?
ఈ సమస్యకి స్వల్ప కాలం పరిష్కారం లేనప్పటికీ వివిధ చికిత్సలు ఉన్నాయి. మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటే వీలైనంత త్వరగా దీన్ని అధిగమించవచ్చు.
❂ కాంతి, ధ్వని లేని ప్రశాంతమైన ప్రదేశంలో నిద్ర పోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ నిద్రకి ఎటువంటి భంగం వాటిల్లదు.
❂ నిద్ర వచ్చేందుకు మెలటోనిన్ సప్లిమెంట్లని పొందవచ్చు. అవి కూడా పరిమితంగా మాత్రమే వినియోగించాలి.
❂ నిద్రించే ప్రదేశంలో ధ్వని లేకుండ చూసుకోవాలి.
❂ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.
❂ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ అందుకు తగిన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్