ఆస్పిరిన్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గుండె పోటే. గుండె పోటు రాగానే ఆస్పిరిన్ వేసుకోవాలని అనుకుంటారు. కానీ అంతకుమించి ఆస్పిరిన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధాలలో ఇవీ ఒకటి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎవరికైనా గుండె పోటు వచ్చిన వెంటనే వైద్యులు సైతం రోగికి ఆస్పిరిన్ అందిస్తారు. అయితే మీరు ఆస్పిరిన్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.  ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీినలో సాలిసైలేట్ ఉంటుంది.అందుకు నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది స్టెరాయిడ్ కాదు కానీ కొన్ని స్టెరాయిడ్ మందుల వల్ల కలిగే ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 


ఆస్పిరిన్ ప్రయోజనాలు
1. తలనొప్పి, జలుబు, కాళ్ల బెణుకులు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, రుతుసమయంలో వచ్చే తిమ్మిరి నొప్పి వంటి వాటికి ఆస్పిరిన్ బాగా పనిచేస్తుంది. 
2. అందరికీ తెలిసినట్టే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వైద్యుని సలహాతోనే దీన్ని వాడాలి. 
3. ఇది రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. రక్తాన్ని పలుచగా మార్చి గుండె వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. 
4. వైద్యులు సాధారణంగా రక్తనాళాల వ్యాధి, హైబీపీ, డయాబెటిస్, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటికి కూడా ఆస్పిరిన్ చక్కగా పనిచేస్తుంది. 
5. గుండెపోటుకు సంబంధింది కరోనరీ సమస్యలను నివారించడంలో ఆస్పిరిన్ మేలు చేస్తుంది. 
6. ఆస్పిరిన్ ఆర్ధరైటిస్, కీళ్ల వాపు, లూపర్, గుండె చుట్టూ వాపు రావడం వంటి ఆరోగ్య పరిస్థితులలో కూడా ఆస్పిరిన్ ను ఉపయోగిస్తారు. 
7. ఎంత డోసు వేయాలన్నది వైద్యులను అడిగి తెలుసుకోవాి. 75 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీ గ్రాముల వరకు తక్కువ మోతాదులో వాడమని సూచిస్తారు. ఈ డోసు గుండె పోటు నివారించడానికి సరిపోతుంది. 


అందానికీ...
ఆస్పిరిన్ మాత్రల్లో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు పొడి చేసి అందులో కాస్త నీళ్లు కలిపి మొటిమలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. ఎరుపుదనం, చీము పట్టడం వంటివి కలగవు. మొటిమలకు అప్లయ్ చేశాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 


Also read: ఈ దేశాలకు వీసా దొరకడం చాలా కష్టమట, ఆ దేశాలేంటో తెలిస్తే షాక్ తింటారు


Also read: షాకింగ్, పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం అంత హానికరమా? ఇలా చేస్తే సేఫ్



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.