IPL Season 2024 : ఐపీఎల్ అనేది ప్రతి ఇండియన్ క్రికెట్ లవర్‌కి ఓ ఎమోషన్. ముఖ్యంగా బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఇదో పండుగే. ఈ సమయంలోనే చాలామంది బెట్టింగ్‌లు వేసి వేలల్లో, లక్షల్లో డబ్బులు సంపాదిస్తారు అంటూ కొందరు స్కామర్లు తెరపైకి వస్తారు. ఇవి ట్రస్టెడ్ సైట్స్ అంటూ.. వాళ్లు మంచి ప్రిడిక్షన్ కూడా ఇస్తారంటూ క్రికెట్ అభిమానులను, డబ్బు అవసరాలు ఉన్నవారిని మోసం చేస్తూ ఉంటారు. వీటిని మీరు ఫాలో అయితే లాభాలు పొందడం కాదు కదా.. నష్టాలు చూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ లింక్స్ జోలికి వెళ్లొద్దు..
అసలే ఇది ధోని లాస్ట్ సీజన్ అంటున్నారు. ఈ సమయంలో బెట్టింగ్స్ వేస్తే వేలల్లో, లక్షల్లో ఏంటి కోట్లు అయినా సంపాదించొచ్చని ఎవరైనా మభ్య పెడితే నిజమేనని నమ్మకూడదు. దీనివల్ల మీరు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరైనా మీకు లింక్స్ పంపి వాటిని ఫిల్ చేయమంటే.. అస్సలు వాటిని ఓపెన్ చేయకండి. మీరు దానిలో బెట్టింగ్ వేసినా.. వేయకపోయినా స్కామర్లు మీ డేటాను కలెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ బ్యాంక్ డిటైల్స్ పూర్తిగా వారి కంట్రోల్లోకి వెళ్లిపోతాయి.
ఇలా బెట్టింగ్ వేస్తే నిజంగానే వస్తాయి.. ఎప్పుడంటే..
డబ్బులు సంపాదించడం ముఖ్యమే. కానీ మన అవసరాలు స్కామర్లకు లాభాలు తెచ్చిపెట్టకూడదు. కొందరు ఇతరుల మాటలు నమ్మి.. తలకు మించిన భారం నెత్తిమీద పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల కొత్తగా డబ్బులు రావడం కాదు.. ఉన్న డబ్బులు కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది. మిమ్మల్ని బెట్టింగ్‌లో ముంచడానికి మొదట్లో కాస్త డబ్బు ఆశ చూపిస్తారు కానీ.. ఆ ఉచ్చులో దింపి మీ దగ్గరున్నవన్నీ ఖాళీ చేసేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాళ్లు ప్రమోట్ చేసేది కూడా డబ్బుల కోసమే..
మీ ఫేవరెట్ హీరోనో, క్రికెటరో, ఇన్ఫ్లూయెన్స్రో ఏదైనా బెట్టింగ్ యాప్‌ని, లేదా సైట్‌ని ప్రమోట్ చేస్తే నిజంగానే దీనిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయనుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాళ్లు కూడా డబ్బులు కోసమే ఈ సైట్స్‌ని ప్రమోట్ చేస్తారని తెలిపారు. కొందరు మా హీరో చెప్పాడంటే నిజంగానే ఇది తోపు సైట్.. మంచి పైసలు వస్తాయని ఇన్వెస్ట్ చేస్తారు. చివరికి మీరు నిండా అప్పుల్లో మునిగిపోయినా.. మీకు అన్యాయం జరిగినా.. ఆ హీరో మీ దరిదాపుల్లోకి కూడా రాడని చెప్తున్నారు.
పాపం.. మిమ్మల్ని నమ్మి వారు మోసపోతారు..
నిజానికి ఈ బెట్టింగ్‌లో మీరు మోసపోయినా.. లేదా మీకు నష్టం వచ్చినా.. మీకన్నా ఎక్కువ ఎఫెక్ట్ పడేది మీ పేరెంట్స్ మీదనే. ఎందుకంటే మీకోసమని చచ్చి.. చెడి డబ్బులు కడతారు. అప్పులు చేయాల్సి వస్తాది. లేదంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తాది. ఇంత చేసినా.. మీరు ఉంటారా లేదా అనేది డౌట్. ఎందుకంటే మనకి పౌరుషాలు ఎక్కువ కదా. బెట్టింగ్ వల్ల ఇలా అయిందని ఇంట్లో వాళ్లు రెండు మాటలు అన్నారని సులువుగా ప్రాణాలు తీసేసుకుంటాము. డబ్బు పోయిందన్న బాధతో రెండు మాటలు అనేస్తారు కానీ.. ప్రాణాలు తీసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చేతికంది వస్తాడనుకున్న కొడుకు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటే వారు బతికున్న జీవచ్చవాలు అయిపోతారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన జరిగింది. లోన్ యాప్స్‌లో ఇంజినీరింగ్ చేసే ఓ కుర్రాడు డబ్బులు తీసుకుని బెట్టింగ్ వేశాడు. వాటిని తీర్చేందుకు మరికొన్ని యాప్స్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. చివరికి బెట్టింగ్‌లో డబ్బులు రాకపోగ.. తలకు మించిన అప్పుల్లో మునిగిపోయాడు. చివరికి తండ్రికి చెప్పి.. ఆస్తులు అమ్మించి.. అప్పులు తీర్చాడు. కానీ అప్పటికే లోన్ తీసుకున్న యాప్‌ల వారు బాధితుడి బంధువులకు లోన్ గురించి మెసేజ్‌లు పంపడంతో పరువుపోయిందని.. ప్రాణాలు తీసుకున్నాడు.
మీ లక్‌ని ఇలా ట్రై చేసుకోవచ్చు..
మీకు నిజంగా బెట్టింగ్ వేయాలనుకుంటే.. చిన్న మొత్తంలో ఓ వందనో.. రెండొందలో వేయవచ్చని.. డబ్బులు వస్తే మాత్రం వేలకు వేలు వేయకుండా జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయమంటున్నారు నిపుణులు. రాలేదా అక్కడితో వదిలిస్తే మంచిది అంటున్నారు. వీలైనంత వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండటమే బెటర్. డబ్బు గురించి ఆశ పడకుండా చక్కగా మ్యాచ్ ఎంజాయ్ చేయగలుగుతారని చెప్తున్నారు. లేదంటే జోమాటో.. స్విగ్గీ వంటి వాటిలో జస్ట్ ప్రిడిక్షన్స్‌తో కొన్ని ఆఫర్స్ ఇస్తారని.. అలాంటి యాప్స్‌లో మీ లక్‌ని ట్రై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇలాంటి వాటిలో ఫ్రీగా కూపన్స్ వస్తాయి. మంచిగా కడుపు నిండా తిని మ్యాచ్‌ని ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు.
Also Read : హీరోలనే తలదన్నేలా ఉన్న ధోని లుక్స్.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటున్న ఫ్యాన్స్