MS Dhoni : హీరోలనే తలదన్నేలా ఉన్న ధోని లుక్స్.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటున్న ఫ్యాన్స్
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకి క్రికెట్ అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. కేవలం ఆటలోనే కాదు.. ప్రతి విషయంలోనూ అభిమానులను ధోని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు. అందుకే అభిమానులు ముద్దుగా తల ఫర్ ఏ రీజన్ అంటారు.(Image Source : Instagram/cskfansofficial)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ మధ్య ధోని లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లాంగ్ హెయిర్ గురించి అభిమానుల మధ్య ప్రత్యేక చర్చ ఉంటుంది.(Image Source : Instagram/cskfansofficial)
తాజాగ ధోని తన లుక్స్‌ని మరింత స్టైలిష్‌గా మార్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ కలర్ కట్ స్లీవ్ టీ షర్ట్‌ని.. బ్లూకలర్ జీన్స్‌తో పెయిర్ చేసి.. కూల్‌గా కళ్లద్దాలు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. (Image Source : Instagram/cskfansofficial)
వయసు నలభైల్లో ఉన్నా.. ఆ ఫిట్నెస్ చూడండి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు F+I+T+N+E+S+S =7 తల ఫర్ ఏ రీజన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Image Source : Instagram/cskfansofficial)
ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ నిర్వహించిన మెగాటోర్నీల్లో భారత్‌ను ధోని తన కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిపాడు.(Image Source : Instagram/cskfansofficial)
అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినా.. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్ కోసమే ధోని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ధోని సారథ్యంలో సీఎస్కే 5 సార్లు ట్రోఫీలు గెలుచుకుంది.(Image Source : Instagram/cskfansofficial)
గతేడాది ధోని ఇంక ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అనుకున్నారు కానీ.. ధోని IPL Season 2024లో కెప్టెన్‌గా సీఎస్కేకు బాధ్యతలు వహిస్తున్నాడు. ప్రస్తుతం ధోని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి.(Image Source : Instagram/cskfansofficial)