Daily Horoscope for March 22nd 2024   


మేష రాశి


ఉద్యోగం , వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. కొంతమంది తమ స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు వస్తాయి. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. (మేష రాశి ఉగాది పంచాగం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి


పనిలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీ భాగస్వామి పట్ల నిజాయితీగా వ్యవహరించాలి. విద్యార్థులకు చదువుపట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏ పని తలపెట్టినా మంచి విజయం సాధిస్తారు. పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు.   ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో పని సవాళ్లు పెరుగుతాయి. ఆఫీసులో మీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. (వృషభ రాశి ఉగాది పంచాగం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


మిధున రాశి 


ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో పని సవాళ్లు అలాగే ఉంటాయి. మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రణాళికను రూపొందించండి.  వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.  ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. కొంతమంది గొంతు నొప్పి లేదా జలుబుతో బాధపడవచ్చు. (మిథున రాశి ఉగాది పంచాగం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.  మీ భాగస్వామితో అనవసర వాదనలు పెట్టుకోవద్దు.  ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేస్తారు. కార్యాలయంలో కొత్త ప్రాజెక్ట్ కోసం బాధ్యత వహించడానికి ఉత్సాహంగా ఉంటారు. రెగ్యులర్ బిజీ వర్క్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవడం బెటర్. మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. (కర్కాటక రాశి ఉగాది పంచాగం  కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


సింహ రాశి


ఈ రాశి ఉద్యోగులు పనిలో సవాళ్లు ఎదుర్కోకతప్పదు. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి వారి అభిప్రాయాలను కూడా గౌరవించండి.  (సింహ రాశి ఉగాది పంచాగం  కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)


కన్యా రాశి


కొంతమంది ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ప్రతికూలతలకు దూరంగా ఉండండి , ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. భాగస్వామ్య వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కొత్త సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి ( కన్యా రాశి ఉగాది పంచాంగం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


తులా రాశి 


కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.  వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. జీవితంలో కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి.  ఆర్థిక విషయాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆఫీసు రాజకీయాల వల్ల పనిలో ఆటంకాలు పెరగవచ్చు. వ్యాపారులు బాకీలు వసూలు చేసుకోవడంలో ఇబ్బందులు  ఎదుర్కొంటారు. ( తులా రాశి ఉగాది పంచాంగం కోసంఈ లింక్ క్లిక్ చేయండి)


వృశ్చిక రాశి


వృత్తి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అన్ని పనులు విజయవంతమవుతాయి. కొంతమందికి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి. పెట్టుబడి అవకాశాలను గమనించండి..నిపుణుల సలహా లేకుండా పెట్టుబడి పెట్టొద్దు.


ధనుస్సు రాశి


సమాజంలో  మీ గౌరవం పెరుగుతుంది కానీ కుటుంబం లేదా బంధువులతో డబ్బు విషయంలో వివాదాలు ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆర్థిక విషయాలలో  తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  


Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!


మకర రాశి


ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మీ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రత్యేక స్నేహితుని సహాయంతో మీరు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందుతారు.


కుంభ రాశి


మీ సంబంధంలో మూడవ వ్యక్తి యొక్క జోక్యం వల్ల సమస్య పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు అందుతాయి.


మీన రాశి 


మీ ఆరోగ్యం పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబం , స్నేహితుల సహకారంతో ఈ రోజు పనిలో అడ్డంకులు తొలగిపోతాయి.  కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. కార్యాలయంలో మీ పనితీరుకి మంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు బాధ్యతలు పొందేందుకు సిద్ధంగా ఉండండి. 


మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.