Body Dysmorphic Disorder Causes : సాధారణంగా ప్రతి మనిషి తన శరీరంలో కొన్ని మార్పులను చూసి బయటకు వెళ్లినప్పుడు వాటి గురించి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతాడు. కొందరు వీటిని ఓవర్కామ్ చేస్తారు. మరికొందరు వీటి గురించి ఆలోచించి.. కృంగి కుమిలిపోతుంటారు. ఈ బాడీ డిస్మోర్పిక్ డిజార్డర్ కూడా అలాంటిదే. అయితే దీనిప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. మానసికంగా బాగా వీక్ చేస్తుంది. హీరోయిన్ ఇలియానా కూడా ఈ డిజార్డర్‌తోనే బాధపడుతున్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో చెప్పింది.
మనసులో ప్రతికూల ఆలోచనలు ఉంటే.. అది రోజువారి దినచర్యపై కూడా బాగా ప్రభావం చూపిస్తుంది. హీరోయిన్ ఇలియానా కూడా ఈ సమస్యతోనే ఇబ్బందిపడుతుందట. తాజాగా తను సఫర్ అవుతున్న డిజార్డర్ గురించి నోరు విప్పింది ఇలియానా. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ అనేది జన్యుపరమైన రుగ్మత. మీరు ఎంత అందంగా ఉన్నా.. శరీరంలోని ఏదొక పార్ట్ బాలేదనే ఫీలింగ్‌తో ఉంటారు. దానిగురించి తెగ సఫర్ అయిపోతూ.. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు.
సింపుల్, సిల్లీ రీజన్ కూడా మిమ్మల్ని కృంగదీయొచ్చు. మీ శరీరంపై ఓ పుట్టుమచ్చకూడా మీలో ఈ ఫీలింగ్‌ని పెంచవచ్చని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీనివల్ల అసౌకర్యంగా ఫీల్ అయి.. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారట. ఇది జన్యుపరంగా వచ్చే మానసిక సమస్య. ఇది ఉన్నవారు.. తమ శరీరంలో ఏదొకదానిని లోపంలా ఫీల్ అవుతారట. అది చూసేవారికి మంచిగా ఉన్నా.. వారికి మాత్రం అదొక డిఫెక్ట్లా కనిపిస్తుందట. ఇలియానా కూడా ఓ విషయంలో అలానే భావించేదట. మరి ఈ డిజార్డర్ లక్షణాలు ఏంటి? ఎలా ఓవర్ కామ్ చేయాలో చూసేద్దాం.
బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లక్షణాలు..
శరీరంలో ఏదో భాగం వెలితిగా ఉందని ఫీల్ అవ్వడం, ప్రతిసారి తనని ఇతరులతో పోల్చుకోవడం, నెగిటివ్ ఆలోచనలు, సమస్యను అధిగమించలేకపోవడం, ఒంటరిగా ఉండడం, అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం, మానసిక ఒత్తిడి వంటి వాటిని బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లక్షణాలుగా చెప్తున్నారు. అయితే ఇది జన్యుపరమైన కారణాలవల్లే వస్తుందట. సోషల్ మీడియా.. పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించేప్పుడు ఇది ఎక్కువయ్యే అవకాశముంది.
నివారణ మార్గాలు..
ఒంటరిగా ఉండకండి. మిమ్మల్ని చీర్ అప్ చేసే వ్యక్తులతో సమయాన్ని గడపండి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. యోగా, మెడిటేషన్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీలో ఉన్న మంచి గురించి మాత్రమే ఆలోచించండి. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపండి. మీరు ఎలా ఉన్నా.. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి.
చికిత్స ఉందా..
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. యాంటీ డిప్రెసెంట్స్ మందులు కూడా హెల్ప్ చేస్తాయి. ఇష్టమైనవారితో టైమ్ స్పెండ్ చేయండి. లేదంటే మిమ్మల్ని మీరే హీల్ చేసుకునే ప్రాసెస్ ప్రారంభించండి.
Also Read : హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అంతా విషమేనా? మోమోలు, షవర్మాలు తినేవారు జాగ్రత్త.. ఆ ఒక్కటే కొంపముంచేస్తోందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.