ఈ ఏడాది సంక్రాంతికి 'హనుమాన్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే థియేటర్లలోనే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి ట్రీట్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నాము అంటూ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరి దీపావళి కానుకగా "జై హనుమాన్" మూవీ నుంచి రాబోతున్న అప్డేట్ ఏంటి? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
2024 సంక్రాంతికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, పాన్ ఇండియా రేంజ్ లో షేక్ చేసింది 'హనుమాన్' మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేయడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 250 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు తెరపైకి వస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు 'హనుమాన్' లవర్స్.
'జై హనుమాన్' టైటిల్ తో సీక్వెల్ ను రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సోషల్ మీడియా వేదికగా ఆయన దీపావళి కానుకగా 'జై హనుమాన్' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు హనుమంతుడు ఉన్న ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
అయితే ఫస్ట్ పార్ట్ అయిన 'హనుమాన్' సినిమాలో హనుమంతుడి ముఖాన్ని చూపించలేదు మేకర్స్. సినిమాలో ఆయన ముఖాన్ని కనిపించకుండా కేవలం విజువల్స్ వాడి బాడీని చూపించి గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. సెకండ్ పార్ట్ లో హనుమంతుడి పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయాన్ని రివీల్ చేస్తామని సస్పెన్స్ లో పెట్టారు. దీంతో సీక్వెల్ ఉంటుంది అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో హనుమంతుడుగా నటించబోయే స్టార్స్ లో చాలామంది పేర్లు వినిపించాయి. ప్రస్తుతానికైతే ఇది సస్పెన్స్ గానే ఉంది. కానీ ఈ లిస్టులో రామ్ చరణ్, యష్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. ప్రస్తుతం వీళ్ళందర్నీ పక్కన పెట్టి...
'కాంతార' సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టిని హనుమంతుని పాత్రకు ఎంపిక చేశారు. మరి, మేకర్స్ 'హనుమాన్' పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయాన్ని ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి. కాగా 'హనుమాన్' మూవీ క్లైమాక్స్ లో వచ్చిన చివరి 5 నిమిషాలు ఏ రేంజ్ లో హై ఇచ్చాయో, అది సెకండ్ పార్ట్ 'జై హనుమాన్'లో రెండు గంటల పాటు ఉంటుందంటూ భారీ హైప్ ఇచ్చారు డైరెక్టర్. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.
Read Also : Disha Patani : కంగువ ప్రమోషన్స్‌లో దిశా పటానీ.. ట్రెడీషనల్ లుక్‌లో అదిరిపోయిందిగా