Helath Tips for Diabetics : మీకు మధుమేహమున్నా.. లేకున్నా.. బ్రేక్​ఫాస్ట్​ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు డాక్టర్లు. ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవడమనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహమున్నవారు బ్రేక్​ఫాస్ట్​పై కచ్చితంగా శ్రద్ధ చూపించాలి అంటున్నారు. తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల మధుమేహం ఎక్కువై.. ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. ఎందుకంటే ఉదయం భోజనం మీ రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా మీ మానసిక స్థితి, శక్తి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొన్ని పొరపాట్లను ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత మంచిదని చెప్తున్నారు.


బ్రేక్​ఫాస్ట్ విషయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు రక్తంలో చక్కెరపై ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీరు రోజంతా యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. లేదంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడాలి. అయితే పొరపాట్లను ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత త్వరగా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ బ్రేక్​ఫాస్ట్ విషయంలో చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


అస్సలు స్కిప్ చేయవద్దు..


చాలామంది ఉదయాన్నే అల్పాహారాన్ని స్కిప్ చేస్తారు. మధుమేహమున్నా.. లేకున్నా బ్రేక్​ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదనేది నిపుణుల వాదన. ముఖ్యంగా మధుమేహమున్నవారు ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అంటున్నారు. ఎందుకంటే రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడానికి మీరు ఉదయాన్నే మందులు తీసుకుంటారు. అల్పాహారం మానేయడం వల్ల రక్తంలో చక్కెర తగ్గి.. మందుల ప్రభావం కూడా పడి.. హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి బ్రేక్​ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకండి. పైగా బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల మధ్యాహ్నం తెలియకుండా ఎక్కువ తినేస్తారు. ఇది కూడా మంచిది కాదు. 


ఫైబర్ కంటెంట్..


డయాబెటిస్ ఉన్నవారికి ఫైబర్ ఫుడ్ చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచేలా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని ప్రోత్సాహిస్తుంది. కాబట్టి మధుమేహమున్నవారు ఉదయాన్నే తమ బ్రేక్​ఫాస్ట్​లో కనీసం 30 గ్రాముల ఫైబర్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు. ఇది గుండె, జీర్ణ, పేగు సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి మీ బ్రేక్​ఫాస్ట్​లో ఫైబర్​ కోసం క్వినోవా, స్ట్రాబెర్రీలు, కీరదోసలతో స్మూతీలు చేసుకోవచ్చు. లేదంటే బాదంతో చియా పుడ్డింగ్​లు కూడా తినొచ్చు. 


కార్బ్​ హైడ్రేట్లు


శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్​లను తీసుకోవడం మధుమేహులకు అస్సలు మంచిది కాదట. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. తద్వారా మీ గుండెను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కాబట్టి మఫిన్లు, డోనట్స్, పేస్ట్రీలు, వైట్ బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు. స్వీట్​ తినాలనిపిస్తే లో ఫ్యాట్ చీజ్ లేదా యోగర్ట్​తో బెర్రీలను జత చేసి క్రేవింగ్స్ తగ్గించుకోవచ్చు. కూరగాయలు, గుడ్లు, పండ్లు, నట్స్, చిక్కుళ్లు వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి బ్రేక్​ఫాస్ట్​లో ఇవి ఉండేలా చూసుకోండి.


అతిగా వద్దు


కొందరు పూర్తిగా తినడం మానేసినట్టే మరికొందరు అతిగా తింటూ ఉంటారు. కాబట్టి అతిగా తినడాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇవి రక్తంలో చక్కెరలు పెంచి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు వేసుకునే మందులకు తగ్గట్టు ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఫైబర్, ప్రోటీన్, అసంతృప్త కొవ్వులు శరీరానికి లభ్యమవుతాయి. 


మంచి బ్రేక్​ఫాస్ట్ రోటీన్ మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట్లో కష్టంగా ఉన్నా.. కొన్ని మార్పు చేస్తే మధుమేహమున్నా.. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫుడ్​లో షుగర్, సంతృప్త కొవ్వులను పరిమితం చేస్తూ.. ఫైబర్, లీన్ ప్రోటీన్ వంటి ఫుడ్ తీసుకుని హెల్తీగా ఉండొచ్చు. 


Also Read : ఇంతకీ మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా? క్యాన్సర్ మచ్చలా?