Horoscope Today 2nd February 2024  - ఫిబ్రవరి 2 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


ప్రొఫెషనల్‌గా ఉండండి. మిమ్మల్ని మీరు విశ్వసించండి. రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. ఈ రోజు మీకు మంచి విజయం అందుతుంది. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజు మీలో వచ్చే మార్చు మిమ్మల్నే ఆశ్చర్యపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఏకాగత్రతో పనిచేయండి. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


మీలో ఏదో సానుకూల శక్తి ఉంటుంది. అర్థవంతమైన సంభాషణల్లో పాల్గొనండి. బంధాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీ నైపుణ్యాలను మెరుగుపర్చడానికి  ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టపడితేనే ఫలితాలు పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది...ఖర్చులు తగ్గించాలి. 


Also Read: మకరంలోకి కుజుడు - ఈ 5 రాశులవారికి మంచిరోజులొచ్చినట్టే!


మిథున రాశి (Gemini Horoscope Today) 


ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఎవ్వరి దగ్గరా అప్పులు చేయవద్దు. ఇదివరకే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు ప్లాన్ చేసుకోవాలి. ఓ గుడ్ న్యూస్ వింటారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహం తగ్గించుకుంటే మీకే మంచిది. ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీ మాట వినడానికి బదులు వారు తమ మనసులో మాట చెప్పేందుకు ఇష్టపడతారు. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


సహోద్యోగులను కలుపుకుని వెళ్లటం ద్వారా మీ పని సులభం అవుతుంది. వృత్తిపరమైన , వ్యక్తిగతమైన డబ్బుకు సంబంధించిన విషయాలు , సమస్యలపై అదనపు శ్రద్ధ వహించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. నూతన పెట్టుబడులు పెట్టొద్దు. డబ్బు ఆదాచేయడంపై దృష్టి సారించాలి. అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించాలి.
 
సింహ రాశి (Leo Horoscope Today)


 మానసిక బలం కోసం ధ్యానం, యోగా ప్రారంభించండి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. డబ్బు ఆదా చేయడం కష్టం. నివాసం మారడం మరింత శ్రేయస్కరం. ప్రేమలో ఉండేవారు ఊహల్లో మునిగితేలుతారు. సమయం = డబ్బు అని ఆలోచిస్తే మీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. 


Also Read: ఈ రాశులవారికి ఫిబ్రవరి నెల చుక్కలు చూపిస్తుంది, నెలాఖరు కొంత ఉపశమనం


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


మీరు ఈరోజు అపరిష్కృత సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకోవచ్చు. బంధువులను కలుస్తారు. మీరు మీ కుటుంబానికి సంబంధించి ఆసక్తికర వార్తలు అందుకుంటారు. నూతన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది కానీ విజయం సాధిస్తారు.


తులా రాశి (Libra Horoscope Today) 


విద్యార్థులు ఈ రోజు చదువుపై కాకుండా ఇతర విషయాలపై శ్రద్ధ పెడతారు. వైవాహిక జీవితంలో ఉండేవారికి జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. మీ దీర్ఘకాలిక సంబంధాలకు ఇది మంచిదికాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం మంచిది. 


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


ఈ రోజు మీరు కెరీర్ సంబంధిత విషయాలలో అవసరమైన నిర్ణయాలు తీసుకోండి. నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. పనిపై సానుకూల దృష్టి పెట్టేందుకు ప్రయత్నించాలి. మీ మనసు చెప్పింది వినండి..విజయం మీకు సమీపంలోనే ఉంటుంది. ఈ రోజు మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఈ రోజు ఈ రాశివారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావొచ్చు.  అపార్థాలు , విభేదాల విషయంలో మీ తప్పులను అంగీకరించడానికి  ఓపికతో సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రస్తుత భావోద్వేగాలు సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించాలి.  ఈ రోజు కొన్ని అడుగులు వెనక్కి తీసుకోవడం మీ వృత్తిపరమైన జీవితంలో ప్రయోజనం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు కృషి చేయాలి.


మకర రాశి (Capricorn Horoscope Today) 


మనస్సు, శరీరాన్ని పునరుద్ధరించడంలో సహాయపడే ఆరోగ్యకరమైన అలవాట్లపై మీ శక్తిని తిరిగి కేంద్రీకరించండి. ఒత్తిడి స్థాయిలను తగ్గించే బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనండి. అదృష్టం కలిసొస్తుంది. మీ లక్ష్యంవైపు పట్టుదలతో ఉంటే విజయం సాధిస్తారు. నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు భయపడొద్దు. మీపై మీరు నమ్మకం ఉంచుకుని సొంత మార్గాన్ని ఏర్పరుచుకోవాలి.


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


ఈ రోజు ఓ ప్రత్యేక వ్యక్తి ఈ రోజు మీ జీవితంలో ఉత్సాహం  తెస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉండొద్దు.  మీ వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పెద్ద మార్పులు జరగబోతున్నాయి. మీరు చేసిన కృషి మరియు అంకితభావానికి శుభ ఫలితం పొందుతారు. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక నష్టాలకు దూరంగా ఉండాలి.


మీన రాశి (Pisces Horoscope Today) 


ఈ రోజు మీకు మంచి రోజు. కెరీర్‌లో విజయాన్ని పొందుతారు.  ఆర్థిక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. నూతన పెట్టుబడులు పెట్టడం మంచిదే కానీ వాటి గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్నాకే అడుగు ముందుక వేయండి. ఊహించని ఖర్చులు ఉంటాయి  డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తగిన విశ్రాంతి అవసరం. 


Also Read: అత్యంత పవిత్రమైన 5 సరస్సులు - ఇవే పంచ సరోవరాలు!


గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.