Screen Time: టీవీ చూడడం, ఫోన్లో సినిమాలు చూడడం, ఎక్కువసేపు లాప్‌టాప్ ముందు లేదా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వంటివన్నీ కూడా స్క్రీన్ టైమ్ కిందకే వస్తాయి. కోవిడ్ మహమ్మారి వచ్చాక స్క్రీన్ సమయం చాలా పెరిగింది. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ వచ్చాక ఉద్యోగులు ఎక్కువ కాలం పాటు స్క్రీన్ ముందే గడుపుతున్నారు. ఆ తర్వాత ఫోన్ అధికంగా చూస్తున్నారు. వారికి తెలియకుండానే రోజులో ఎక్కువ సమయం స్క్రీన్ ను చూస్తూనే జీవిస్తున్నారు. ఇది మానసిక ఆరోగ్యంపై, శారీరక ఆరోగ్యం పై, హార్మోన్ల పైనా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడానికి ఇది కారణం అవుతుంది. 


మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకోవడం
మెలటోనిన్ మనకు అత్యవసరమైన హార్మోన్. దీని ఉత్పత్తి తగ్గితే నిద్రా రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి దీని ఉత్పత్తిని నిరోధించే పనులను మానుకోవాలి. స్క్రీన్ టైం పెరగడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిపై చాలా ప్రభావం పడుతుంది. ఇలా జరిగితే క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాలు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది.


ఒత్తిడి హార్మోన్లు
స్క్రీన్ టైం పెరిగినప్పుడు ఆ స్క్రీన్ నుంచి వచ్చే లైట్లు మన చర్మం పై పడతాయి. ఆ లైట్లు శరీరంపై ఒత్తిడిని చూపిస్తాయి. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ పై పదేపదే ఒత్తిడికి కారణం అవుతుంది. దీని ఫలితంగా కోపం పెరగడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, దూకుడుగా మారడం, ఇతరులపై ప్రేమ, దయా, జాలి వంటివి తగ్గడం జరుగుతుంది. హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడం వల్లే ఇలా అవుతుంది. 


ఆకలి పెరగడం లేదా తగ్గడం
అధిక స్క్రీన్ సమయం నిద్రా సామర్ధ్యాన్ని మాత్రమే కాదు, ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఆకలిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. లెప్టిన్, గ్రెలిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల ఆకలి వేయకపోవడం లేదా అతిగా ఆకలి వేయడం వంటివి జరుగుతాయి. బరువు అమాంతం పెరగడం లేదా చాలా తగ్గిపోవడం అవుతుంది. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 


ఉద్యోగపరంగా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం కష్టమే. కానీ ఫోన్ వాడకాన్ని తగ్గించినా చాలు ఎంతో ఆరోగ్యం. నిజానికి ఫోన్ సమయమే అధికంగా ఉంటుంది. దీన్ని తగ్గించుకుంటే శారీరకంగా, మానసికంగా వచ్చే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు.




Also read: పరగడుపున ఖాళీ పొట్టతో చెరుకు రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు



Also read: సీనియర్ ఎన్టీఆర్‌కు ఇడ్లీలంటే ఎంత ఇష్టమో, ఆయన మెనూలో ఉండే ఆహారాలు ఇవే













































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.