కిడ్నీలో రాళ్లున్నాయన్న సమస్య ఎక్కువగానే వింటుంటాం. కానీ ఏకంగా 156 రాళ్లు ఒకే వ్యక్తికి చెందిన కిడ్నీలలో ఉండడం మాత్రం దేశంలోనే మొట్టమొదటిసారి చూస్తున్నాం అంటున్నారు వైద్యులు. ఎక్కడో కాదు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలోనే ఓ కిడ్నీ రోగి చేరాడు. అతడికి దాదాపు 50 ఏళ్లుంటాయి. అతడి కిడ్నీల్లో పరిశీలిస్తే ఏకంగా రాళ్ల గుట్ట కనిపించింది వైద్యులకి. ‘కీహోల్ ఓపెనింగ్’ ద్వారా 156 రాళ్లను తొలగించారు. శస్త్రచికిత్సకు బదులుగా లాప్రోస్కోపి, ఎండోస్కొపీని ఉపయోగించి రాళ్లను తొలగించారు. 


రోగిని కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ఒక స్కూల్ టీచర్‌గా గుర్తించారు. ఆకస్మికంగా కడుపునొప్పి రావడంతో వైద్యులను కలిశారు. స్క్రీనింగ్లో  రాళ్లు అధికంగా ఉన్నట్టు గమనించారు. ఆ రాళ్లు లెక్కిండానికి కూడా వీల్లేకుండా కిడ్నీలలో పరుచుకున్నాయి. వాటిని తొలగించడం చాలా సవాలుతో కూడుకున్న పనిగా వైద్యులు భావించారు. ఈ రాళ్లు రెండేళ్ల క్రితం నుంచే పెరుగుతున్నట్టు గుర్తించారు. వాటిని తీసేందుకు ముందు ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి వచ్చినట్టు తెలిపారు యూరాలజిస్టులు. 


మూడుగంటల పాటూ సాగిన ప్రక్రియలో రాళ్లను పూర్తిగా వెలికితీశారు. అయితే రోగి శరీరంపై చిన్న కోత కూడా పడలేదు. సాధారణ కీహోల్ ఓపెనింగ్ పద్ధతిలోనే రాళ్లను పూర్తిగా తీశారు. రోగి కూడా ఆరోగ్యంగా ఉన్నాడని, సాధారణంగా తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకున్నాడని తెలిపారు వైద్యులు.   


ఎందుకు ఏర్పడతాయి?
కిడ్నీలు రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తాయి. ఈ పని సక్రమంగా జరగాలంటే తగినంత నీళ్లు శరీరంలో ఉండాలి. నీళ్లు తక్కువైతే మూత్రపిండాలలో వ్యర్థాలు పేరుకుపోయి రాళ్లలా మారుతాయి. అందుకే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నీళ్లు తాగాల్సిందే. 


Read also: ఈ బ్లడ్ గ్రూపు వారికి మతిమరుపు వచ్చే అవకాశం చాలా ఎక్కువ... నిర్ధారించిన అధ్యయనం


Read also: 2022లో ‘సెక్స్ కాఫీ’దే హవా? మూడ్‌ను రొమాంటిక్‌గా మార్చే ఈ కాఫీ కథేంటీ?


Read also: పొట్ట దగ్గరి కొవ్వు తగ్గాలా? రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి


Read also: షాకింగ్.. ఆలూ చిప్స్ ప్యాకెట్లకు ప్యాకెట్లు లాగిస్తున్నారా? ఈ రోగాలకు వెల్‌కమ్ చెప్పినట్లే.. హార్వర్డ్ అధ్యయనం


Read also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే


Read also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్


Read also: ఈ అలవాట్లున్నాయా... మీ గుండె ప్రమాదంలో పడినట్టే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి