ప్రతి మహిళ జీవితంలో ప్రతి నెలలో మూడురోజులు నెలసరికే అంకితం. వచ్చే వరకు టెన్షనే. వచ్చాక మరో టెన్షన్. అతిగా బ్లీడింగ్ అవ్వడం, తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, వికారం, మూడ్ స్వింగ్స్, ఒళ్లు బరువుగా ఉండడం ... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మహిళ విషయంలో ఒక్కో రకంగా కనిపిస్తాయి ప్రభావాలు. ఆ మూడు రోజుకు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. మీరు తీసుకునే ఆహారం కూడా ఆ మూడు రోజులు చాలా మార్పులకు కారణం అవుతుంది. కాబట్టి ఆ రోజుల్లో చాలా సాత్వికాహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. 


1. కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు వంటివి తాగడం మానేయండి. వీటిని తాగడం వల్ల నెలసరి నొప్పులు పెరుగుతాయి. ఆ నొప్పుల వల్ల ఇంట్లో పనులు కూడా చేసుకోలేరు. 


2. కాఫీ, టీలు కూడా తగ్గించాలి. వాటిలో ఉండే కెఫీన్ నొప్పులను మరింత పెంచుతుంది. గర్భశయానికి వెళ్లే రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీంతో నొప్పి మరింతగా పెరుగుతుంది. 


3. ఆ మూడు రోజులు కూరల్లో, వంటకాల్లో ఉప్పు తక్కువగా వేసుకోవడం ప్రారంభించండి. ఆ ఉప్పు వల్ల కూడా కడుపుబ్బరం అధికమవుతుంది. అందుకే బయట దొరికే చిప్స్ వంటివి కూడా తినవద్దు. 


4. కొవ్వు అధికంగా ఉండే ఆహారం కూడా నెగిటివ్ ప్రభావాలను చూపిస్తుంది. మాంసాహారం, పాల ఉత్పత్తులు కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ మీద అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. వీటివల్ల మూడ్ స్వింగ్స్, ఒళ్లు బరువుగా ఉండడం, రొమ్ముల్లో నొప్పి కలగడం వంటివి కలుగుతాయి.


5. పుల్లని ఆహారాన్ని కూడా దూరం పెట్టాలి. పుల్లని గోంగూరతో వండి వంటకాల వల్ల కూడా బ్లీడింగ్ పెరుగుతుంది. 


6. నువ్వులు, బొప్పాయిలను కూడా ఆ మూడు రోజులు దూరంగా పెట్టాలి. లేకుంటే బ్లీడింగ్ అతిగా అవుతుంది. దీని వల్ల రక్త హీనత సమస్య మొదలవుతుంది. 


ఆ మూడు రోజులు పప్పు, బీన్స్, వంకాయలు, బంగాళాదుంపలు, పాలకూర, గుడ్లు, పండ్లు వంటి సాత్వికాహారంతో భోజనాన్ని ముగించాలి.  మజ్జిగ తాగినా మంచిదే.


Also read: కొందరి ఆడవాళ్లకు గడ్డాలు, మీసాలు మొలుస్తాయి, ఎందుకు?



Also read: శాకాహారంతో మగవారు ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు


Also read: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఇవిగో