మగవారిని కలవరపరుస్తున్న సమస్యల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ఒకటి. ఓ సర్వే ప్రకారం ఏటా 52,300 మంది మగవారు ఈ క్యాన్సర్ బారిన పడుతుంటే, వారిలో పదకొండు వేల మందికి పైగా మరణిస్తున్నారు. కేవలం ఈ సంఖ్య బ్రిటన్ దేశానికి చెందినవే. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండే ఆ దేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మిగతా దేశాల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అందుకే ప్రొస్టేట్ క్యాన్సర్ విషయంలో పురుషులంతా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ముసలివారిలోనే ఈ క్యాన్సర్ కనిపించేది, ఇప్పుడు మాత్రం యువతను వదిలిపెట్టడం లేదు. ప్రొస్టేట్ అంటే వీర్య గ్రంథి. ఈ గ్రంథిలో క్యాన్సర్ కణితులు పెరగడం మొదలైతే దాన్ని ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు.
శాకాహార రక్ష
కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషులను ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే శక్తి శాకాహారానికే ఉన్నట్టు తేలింది.పండ్లు, కూరగాయలు అధికంగా తినే మగవారిలో ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ మోతాదులు తక్కువగా ఉన్నట్టు తేలింది. దీనివల్ల వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ఈ క్యాన్సర్ సోకినా తీవ్రంగా మారి, ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. పండ్లు కూరగాయల్లో వృక్ష రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. బరువు కూడా పెరగరు. శాకాహారం వల్ల మగవారికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.
ఆ సమస్య కూడా...
అనేక మంది మగవారిని ఇబ్బంది పెడతున్న మరో సమస్య అంగస్తంభన వైఫల్యం. ఇది మగవారి మానసిక ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. భారతీయ వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ఇది కూడా ఒక ఆరోగ్య సమస్యే. దీన్ని లైంగిక అసమర్థతగా భావించాల్సిన అవసరం లేదు. చికిత్స చేయించుకుంటే అంతా సవ్యంగా మారుతుంది. ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే దంపతుల మధ్య సాన్నిహిత్యం లోపించి సమస్యలకు దారితీస్తుంది. వారి మధ్య గొడవలు పెరిగేందుకు కూడా కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు పూర్తిగా శాకాహారానికే పరిమితమైతే చాలా మంచిది. అంతేకాదు శాకాహారం మాత్రమే తినేవారిలో ఈ లోపం పెద్దగా కనిపించడం లేదు. ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్న వారు కూడా పూర్తిగా శాకాహారాన్నే తినమని సూచిస్తున్నారు పరిశోధకులు.
Also read: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన అల్పాహారాలు ఇవిగో