Heart Attacks in Youth : వయసైపోయిన వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఈ మధ్య చిన్నవారిలోనూ, యువతలోనూ ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో హార్ట్ ఎటాక్ కూడా ఒకటి. గతంలో వయసుపరంగా పెద్ద అవుతున్న వారిలోనూ, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలోనూ ఇవి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎలాంటి అలెర్ట్ లేకుండా యువత ప్రాణాలు తీసుకుంటుంది ఈ హార్ట్ ఎటాక్. ఆందోళన కలిగిస్తున్న ఈ అంశంపై నిపుణులు కొన్ని ప్రధాన కారణాలు గుర్తించారు. యువతలో హార్ట్ ఎటాక్ రావడాన్ని.. కొన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ అంశాలు ఏంటంటే.. 


లైఫ్ స్టైల్​ 


స్మోకింగ్ : యువతలో స్మోకింగ్ అలవాటు విపరీతంగా పెరుగుతుంది. కొందరు ఫ్యాషన్ అంటూ.. మరికొందరు స్ట్రెస్ అంటూ స్మోక్ చేస్తున్నారు. ఇది గుండెపై తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్, ఇతర ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి. 


సోమరితనం : ఫిజికల్​గా యాక్టివ్​గా లేకపోవడం, ఎక్కడ ఉంటే అక్కడే పనులు జరగాలనుకోవడం వల్ల ఒబేసిటి, బీపీ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇవి క్రమంగా గుండె సమస్యలను పెంచుతున్నాయి. 


డైట్ : రుచిగా ఉండే ఫుడ్​ని తీసుకోవాలని.. స్ట్రీట్ ఫుడ్, ఇతర అన్​ హెల్తీ ఫుడ్​ని తీసుకుంటూ ఉంటారు. వీటిలోని ఫ్యాట్స్, సాల్ట్, షుగర్ గుండె వ్యాధుల ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతాయి. వీటి ప్రభావం ఒకేసారి చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. 


ఒత్తిడి : చదవు, ఉద్యోగం, ఫ్యామిలీ, లవ్ ఇలా ఎన్నో అంశాలు యువతలో ఒత్తిడిని పెంచుతున్నాయి. స్ట్రెస్ అనేది శారీరకంగా, మానసికంగా కృంగదీసి.. హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. 


నిద్ర : రాత్రుళ్లు లేట్​గా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం. ఇలా రెగ్యూలర్​గా చేయడం వల్ల గుండె సమస్యలు తీవ్రంగా పెరుగుతాయి. నిద్రలో శరీరం రీసెట్ అవుతుంది. అదే కరెక్ట్​గా నిద్రపోకపోతే.. అది రీసెట్ కాదు. ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. దానితో పాటు గుండె సమస్యలను తీవ్రం చేస్తుంది. 


జన్యుపరమైన అంశాలు


కుటుంబంలో ఎవరికైనా గుండె వ్యాధులు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే వాటి ఎఫెక్ట్ ఆ ఫ్యామిలీలోని యువతపై కూడా ఉంటుందట. అలాగే ఫ్యామిలీలో హైపర్ కొలెస్టెరోలేమియా వంటి జన్యుపరమైన రుగ్మతలు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయట. 



తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 


రోటీన్ : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. రోజూ కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఎరోబిక్స్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేయొచ్చు. వారంలో రెండు రోజులు స్ట్రెంత్ ట్రైయినింగ్ చేసిన మంచి ఎఫెక్టివ్​గా ఉంటుంది. ఇవన్ని చిన్నవయసులో వచ్చే గుండె ప్రమాదాలను దూరం చేస్తాయి. ఫిట్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ మీ రోటీన్​లో భాగమైపోవాలి.


డైట్ : గుండె ఆరోగ్యంగా ఉండడంలో డైట్ ప్రధా పాత్ర పోషిస్తుంది. ప్రోసెస్ చేయని ఫుడ్స్ అంటే.. పండ్లు, కూరగాయలు, మల్టీగ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ కోసం మీరు చికెన్, చేపలు కూడా తీసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్​లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వడంతో పాటు గుండె సమస్యలు తగ్గుతాయి. 


స్మోకింగ్ : యువతకు స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయడం కష్టంతో కూడుకున్న పని. అయితే మీరు దానిని కంట్రోల్ చేసుకునేందుకు.. స్మోకింగ్​ని ట్రిగర్ చేసే అంశాలకు దూరంగా ఉండాలి. మెడికల్ హెల్ప్ తీసుకోవచ్చు. నికోటిన్ రిప్లేస్​మెంట్ థెరపీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. 


ఒత్తిడిని : ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్, యోగా, రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి. వీటిని చేయడం వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్​గా ఉంటుంది. అలాగే మీరు రిలాక్స్ అయ్యేందుకు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే.. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతూ ఉంటుంది. 


ఒబేసిటి : యువతలో ఒబేసిటి పెరిగి.. అది డయాబెటిస్, హార్ట్ సమస్యలకు దారి తీస్తుంది. దీనిని తగ్గించుకునేందుకు వీలైనంత యాక్టివ్​గా ఉండేలా చూసుకోవాలి. డెస్క్ జాబ్ అయినా కనీసం గంటకోసారి పది నిమిషాలు నడవాలి. షుగర్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అన్​హెల్తీ ఫ్యాట్స్​ని పూర్తిగా మానేయాలి. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. మెడికల్ సపోర్ట్ కచ్చితంగా తీసుకోవాలి. 


లైఫ్​ స్టైల్​లో ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మీరు మంచి రిజల్ట్స్ చూడొచ్చు. అలాగే రెగ్యులర్​గా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం వల్ల సమస్యను రాకుండా ఆపవచ్చు. అలాగే ముందుగానే సమస్యను గుర్తిస్తే.. దానిని తగ్గించుకోవడం సులభంగా ఉంటుంది. 



Also Read : గుడ్లను ఇలా తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? టైమింగ్స్, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే