Horoscope Today 04th  December 2024


మేష రాశి


ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అధికారులతో విభేదాలు రావచ్చు. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. కుటుంబంతో మీ సమన్వయం బావుంటుంది. చట్టపరమైన విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. 


వృషభ రాశి


ఈ రోజు చికిత్స కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొంత సమస్య ఉంటుంది.  మనసులో తెలియని భయం వెంటాడుతుంది. మీ మాటలతో ప్రభావితం చేయగలరు. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మిశ్రమఫలితాలున్నాయి. 


మిథున రాశి


ఈ రోజు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఉంటాయి. మీరు చేపట్టిన పనిలో బిజీగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగ ఉంటుంది. మాటలు నియంత్రించుకోవడం మంచిది


Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లోకి నో ఎంట్రీ !


కర్కాటక రాశి


ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఇతరులపై ఎక్కువగా ఆధారపడవద్దు. మీరు ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. కెరీర్ పరంగా అదృష్టవంతులు అవుతారు. సహోద్యోగులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి. ప్రేమ సంబంధాలలో పరిమితంగా ఉండండి. పని వాతావరణం చాలా బాగుంటుంది 


సింహ రాశి


ఈ రోజు కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు. అహం కారణంగా, సన్నిహిత వ్యక్తులు దూరం అవుతారు. ఎప్పటి నుంచో సాగుతున్న పనికి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కెరీర్లో గందరగోళానికి గురవుతారు. 


కన్యా రాశి


ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కెరీర్‌కు సంబంధించి మీరు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండె రోగులకు ఈ రోజు కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుస్తారు. 


తులా రాశి


ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో సమర్థతను ప్రదర్శిస్తారు. మీరు కొన్ని విషయాలలో అదృష్టవంతులు అవుతారు. స్నేహితులు, బంధువులను కలుస్తారు. పెండింగ్ చెల్లింపును పొందే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో లాభం ఉంటుంది.


Also Read: మకరంలోకి శుక్రుడు.. నెల రోజుల్లో ఈ రాశులవారు కొత్త ఇల్లు లేదా నూతన వాహనం కొనుగోలు చేస్తారు!


వృశ్చిక రాశి


ఈ రోజు మీ దినచర్య చాలా బాగుంటుంది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. పనిచేసే ప్రదేశంలో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు.  ఆకస్మిక కోపం ప్రభావం పనిపై పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.


ధనస్సు రాశి


మీరు ఈరోజు మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆత్మవిశ్వాసంతో పని చేయండి...మంచి ఫలితాలు పొందుతారు. మీ ఆదర్శవాదం కారణంగా  అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. 


మకర రాశి


మీరు మీ లక్ష్యాలను సకాలంలో పూర్తిచేస్తారు. ఈరోజు కార్యాలయ వాతావరణం ప్రతికూలంగా ఉండవచ్చు. మీ మొండి స్వభావం కారణంగా వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీజనల్ వ్యాధులబారిన పడతారు.


కుంభ రాశి


ఈ రోజు వ్యాపారంలో భారీ ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రోజు మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. కుటుంబంతో కలసి ఆహ్లాదకరమైన ప్రదేశాలు సందర్శిస్తారు. మీరు ఇంతకు ముందు చేసిన కృషికి అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు. ఇంట్లో ఆనందం  ఉంటుంది. 


మీన రాశి


ఈ రోజు కార్యాలయంలో చాలా చురుకుగా ఉంటారు. స్నేహితుల నుంచి గుడ్ న్యూస్ వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటతూలొద్దు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.  


 


 


Also Read: వక్రం నుంచి సాధారణ స్థితిలోకి బుధుడు - ఇయర్ ఎండ్ ఈ 4 రాశులవారికి అదిరిపోతుంది!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.