Heavy Rains in Sabarimala Ban on Those Places: అయ్యప్ప దేవాయ నమః అంటూ శబరిమల సన్నిధానానికి భక్తులు పోటెత్తుతున్నారు. జోరువానలోనూ భక్తుల రద్దీ తగ్గడం లేదు. పంబ, సన్నిధానంలో ఎడతెరిపిలేని వాన పడుతోంది..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్వామిదర్శనం కోసం భక్తులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు..


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కేరళలోనూ వానలు కురుస్తున్నాయ్. కేరళలో నాలుగు రోజులుగా భారీ వర్షాలకు శబరిమల వెళుతున్న అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వానలు కురుస్తుండడంతో ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. 


పంపానదిలో ప్రవాహం పెరగడంతో అప్రమత్తం అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు అయ్యప్ప భక్తులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని ప్రదేశాల సందర్శన నిషేధం విధించారు. NDRF, అగ్నిమాపక, రాపిడ్ యాక్షన్ టీం, పోలీసు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని..భక్తులెవరూ ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని సూచనలు జారీ చేశారు. 


Also Read: శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!


శబరిమలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో కొన్ని ప్రదేశాల్లోకి భక్తులను అనుమతించరాదని ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా అటవీ ప్రదేశం, నదులున్న ప్రాంతాల్లోకి కూడా భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతానికి పంబా దగ్గర ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్వాములు స్నానానికి దిగొద్దని సూచించారు అధికారులు. 


భారీవానలకు రిజర్వాయర్లలో నిండిన నీటిని విడుదల చేసే అవకాశం ఉంది..అందుకే నదులు దాటడం, మార్గ మధ్యలో స్నానాలు చేయడం మంచిది కాదని అధికారులు సూచించారు. మరోవైపు ఇడుక్కి జిల్లా  ముక్కు జి సత్రం అటవీ మార్గంలో ప్రయాణాలు చేయడం సురక్షితం కాదన్నారు.


డిసెంబరు 5వ తేదీవరకూ భారీవానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో..అయ్యప్ప భక్తులకు వనయాత్ర నిషేధించారు. కేవలం పంపాబేస్ నుంచి మాత్రమే అనుమతి ఉంది. శబరిమల చేరుకునేందుకు ప్రధానంగా మూడు రహదారులుున్నాయి. అవి పులిమేడు, ఏరుమేళి నుంచి పెదపాదం...పంపా బేస్ నుంచి చినపాదం...ఈ మూడు మార్గాల్లో ప్రస్తుతం కేవలం పంపాబేస్ నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికే పులిమేడ్ మార్గంలో కుజుత్తకులి సమీపంలో చిక్కుకుపోయిన 12 మంది భక్తులను జాతీయ విపత్తు నిర్వహణ బృందం కాపాడింది. 


Also Read: శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!


వర్షాలు పూర్తిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేవరకూ ఈ ఆదేశాలు అమలవుతాయని పతనం తిట్టా కలెక్టర్ స్పష్టం చేశారు. ఒక్కోసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని..అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకే ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  


 
మరోవైపు భారీ వానలు కురుస్తున్నా భక్తుల రద్దీ తగ్గలేదు. పంబ నుంచి అయ్యప్ప సన్నిధానం వరకూ క్యూలైన్ ఉంది. స్వామి దర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. రద్దీ నుంచి బయటపడేందుకు ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ భక్తులకు ఈ విషయంలో ఇక్కట్లు తప్పడం లేదు.  


Also Read: మీలో ఈ మార్పులు రానప్పుడు మీరు మళ్లీ మళ్లీ అయ్యప్ప మాల వేయడం వృధా!