Venus in Capricorn: నెలకో రాశిలో పరివర్తనం చెందే శుక్రుడు డిసెంబరు 02న మకరరాశిలో ప్రవేశించారు..డిసెంబరు 29 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రభావంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రసంచారం సరైన దిశలో ఉంటే ఐశ్వర్యం, ఆనందంతో పాటూ కళలు, సాహిత్య రంగాల్లో వృద్ధి చెందుతారని పండితులు చెబుతారు. మకర రాశిలో శుక్రుడి సంచారం ఏ రాశులవారికి లాభం కలుగుతుందంటే...


వృషభ రాశి


శుక్రుడి సంచారం ఈ రాశివారి కెరీర్లో వృద్ధిని సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీరు ప్రియమైనవారితో మంచి సమయాన్ని ఆనందిస్తారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఇంటి పెద్దలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. కృషి , ఏకాగ్రతతో మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు.  కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఆలోచన చేయవచ్చు. 


Also Read: డిసెంబరు 01 నుంచి 07 ఈ వారం ఈ రాశులవారికి అన్నీ శుభాలే!


మిథున రాశి


ఈ రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మీతో కలసి పనిచేసేవారంతా సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగుపెడతారు. సృజనాత్మక పనులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు.  విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ సానుకూల స్వభావాన్ని అంతా అభినందిస్తారు.


తులా రాశి


మీరు కార్యాలయంలో  సహోద్యోగుల నుంచి ప్రత్యేక మద్దతు పొందవచ్చు. వృత్తి, ఉద్యోగాలలో శుభఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త కళలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు పొందుతారు.   మీరు శత్రువులపై విజయం సాధిస్తారు.


ధనుస్సు రాశి


శుక్రుని ప్రభావం వల్ల ధనస్సు రాశివారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆలోచనాశక్తి, తెలివితేటలను అంతా అభినందిస్తారు.  ఇంటర్వ్యూలో పాల్గొంటే విజయం సాధిస్తారు. స్నేహితులను కలుస్తారు.కుటుంబ సభ్యులతో మీ సమన్వయం అద్భుతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కెరీర్లో మీరు ఊహించని మార్పు వస్తుంది


Also Read: గీతాజయంతి, ధనుస్సంక్రాంతి సహా 2024 డిసెంబర్ లో పండుగల జాబితా ఇదే!


కుంభ రాశి


శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశి ఉద్యోగులకు ఈ నెలరోజులు శుభసమయమే. వ్యాపారులకు శుక్రుడి సంచారం లాభాలు తెచ్చిపెడుతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు..నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారు ఉద్యోగాలు మారే అవకాశాలు లభిస్తాయి. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!